Home

»

Latest News

MOuni Roy: విడాకులు తీసుకోబోతున్నారా!.. రీసెంట్ గా చిరుతో స్పెషల్ సాంగ్ 

May 12, 2026

 

-కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్న మౌనీ రాయ్ 
-రీసెంట్ గా చిరుతో విశ్వంభరలో చిందులేసిన భామ 
-ఇనిస్టాలో హస్బెండ్ ని అన్ ఫాలో 
-మరి  విడిపోతున్నారనే వార్తలు నిజమేనా!  

 

మౌనీ రాయ్.. మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ మూవీ విశ్వంభరలో స్పెషల్ సాంగ్ చేసింది. రణబీర్ కపూర్, నాగార్జున బ్రహ్మాస్త్ర లోను తన పెర్ఫార్మ్  తో మెప్పించిన మౌని రాయ్, నాగిని సీరియల్ తో అయితే దేశ వ్యాప్తంగా ఫేమస్. ఇప్పుడు ఈ భామ తన భర్త నుంచి విడాకులు తీసుకోబోతుందనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. 


మౌనీ రాయ్ కి  దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ తో 2022 జనవరిలో  వివాహం జరిగింది . గోవా వేదికగా జరిగిన వీరి వివాహ వేడుక అప్పట్లో ఒక సంచలనం., ఇటీవల ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయని, దీంతో విడిపోనున్నారనే  వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఇందుకు బలాన్ని చేకూర్చేలా  మౌనీ రాయ్ రీసెంట్ గా ఇనిస్టాగ్రమ్ లో  సూరజ్ తో ఉన్న ఫోటోలని డిలీట్ చేసి అన్ ఫాలో చేసింది. పెళ్లి పిక్స్ ని మాత్రం ఉంచింది. కానీ సూరజ్ తన అకౌంట్ నుంచి పెళ్లి పిక్స్ ని డిలీట్ చేసాడు. మౌని రాయ్  స్నేహితురాలు అగ్ర హీరోయిన్ దిశా పటాని సైతం సూరజ్ ని అన్ ఫాలో చేసింది. దీంతో మౌని రాయ్, సూరజ్ విడిపోనున్నారనే న్యూస్ మరింత వైరల్ గా మారింది.

Also read: Britney Spears: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. ప్రముఖ సింగర్ కి జైలు శిక్ష 


ప్రస్తుతానికి విడాకుల వార్తలపై మౌనీ రాయ్ గానీ, సూరజ్ నంబియార్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అభిమానులు మాత్రం ఆ ఇద్దరు ఎప్పటికీ కలిసే ఉండాలని కోరుకుంటున్నారు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com