Home

»

Latest News

కన్నడ హీరోయిన్ల సంచలన పోస్ట్.. ఆ టిప్పు సుల్తాన్ మాకు ఎప్పుడో తెలుసు

Mar 04, 2026

 

-పోస్ట్ లో ఏముంది 
-ఎవర్ని టార్గెట్ చేసారు 
-అసలు ఆ అవసరం ఎందుకు వచ్చింది


గాడ్ క్రియేట్ చేసిన వాటిల్లో 'కళ' కూడా ఒకటి. సదరు కళకి మరో రూపం సినిమా. అలాంటి  సినిమా సుదీర్ఘ కాలం నుంచి యావత్తు విశ్వాన్ని అలరిస్తూ వస్తుంది. ఈ విషయంలో కులం, మతం,ప్రాంతం, దేశం అనే బేధాలు ఉండవు. కేవలం కళ మాత్రమే సినిమాలో నిక్షిప్తమై  ఉంటుంది. ఈ విషయం అందరికి తెలిసిందే. కానీ రుక్మిణి వసంత్, (Rukmini vasanth),ఆషికా రంగనాధ్,(ashika ranganath),సప్తమి గౌడ(Sapthami Gowda)వలన కళ గురించి మరోసారి చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. పూర్తి డీటైల్స్ చూద్దాం.

రీసెంట్ గా ఈ ముగ్గురు ఇనిస్టా వేదికగా కీలకమైన పోస్ట్ చేసారు. సదరు పోస్ట్ లో మేము 'కళ' కోసం ఇక్కడ ఉన్నాం. హీరోయిన్ హోదాలో పబ్లిక్ ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ఫోటోలు, వీడియోల్ని అనుచిత కోణాల్లో చిత్రీకరించి ప్రసారం చేస్తున్నారు. అనవసరమైన జూమ్ లతో మా పని కంటే శరీర బాగాలకే ఎక్కువ విలువనిస్తున్నారు. ఈ విషయంలో కొంత మంది ప్రవర్తన మమల్ని అగౌరవ పరిచేలా ఉంది. ఇక ఇలాంటి చర్యలని సహించం. ఈ విషయంలో నటీమణులందరం ఏక తాటిపై నిలబడతామని ముగ్గురు ఒకే  రీతిలో ఇనిస్టా వేదికగా పోస్ట్ చేసారు. అభిమానులు కూడా ఆ ముగ్గురు మాటలని సపోర్ట్ చేస్తున్నారు.

also read:  Toxic: టాక్సిక్ రిలీజ్ వాయిదా.. కారణం తెలిస్తే షాక్ గ్యారంటీ 

 ఆ ముగ్గురి అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే రుక్మిణి వసంత్ ప్రెజంట్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా చేస్తుంది. మేకర్స్ ఏరి కోరి రుక్మిణి ని ఎంపిక చేసుకున్నారు. ఆషికా రంగనాధ్ ఏమో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర లో చేస్తుంది. సప్తమి గౌడ నుంచి కొత్త చిత్రం ప్రకటన రాకపోయినా గత వారం రిలీజైన 'రైజింగ్ ఆఫ్ అశోక' లో కనపడి మెప్పించింది. ఆ ముగ్గురు కన్నడ భామలనే విషయం తెలిసిందే. 



 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com