
తుపాకీ మూవీ నుంచి ఇళయ దళపతి 'విజయ్'(Vijay)కి తెలుగు నాట మంచి క్రేజ్ ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో విజయ్ కట్ ఔట్స్, బ్యానర్స్ కూడా కనిపిస్తుండటం సర్వ సాధారణం. దీంతో విజయ్ సినిమా రిలీజ్ రోజు థియేటర్స్ దగ్గర అభిమానులతో పాటు ప్రేక్షకుల హడావిడి కనిపిస్తుంటుంది. కానీ నిన్న రిలీజైన జన నాయకుడు సాధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ మేకర్స్ కి షాక్ ఇస్తున్నాయి.
జన నాయకుడు తెలుగు రెండు రాష్ట్రాలు కలుపుకొని 2.75 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. విజయ్ గత రెండు ప్రీవియస్ చిత్రాలు లియో 16 కోట్ల గ్రాస్, గోట్ 3 కోట్ల గ్రాస్ సాధించాయి. లియో మూవీ టైంలో 16 కోట్లు రావడానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ బ్రాండ్ తోడయ్యింది. మరి ఇప్పుడు విజయ్ చివరి మూవీ అయినా కూడా తెలుగు నాట షాకింగ్ కలెక్షన్స్ రావడం గమనార్హం. ట్రైలర్ రిలీజైన దగ్గరనుంచే గాడ్ ఆఫ్ మాసెస్ భగవంత్ కేసరికి రీమేక్ అని తెలియడమే తక్కువ కలెక్షన్స్ ని కారణమనే టాక్ వినిపిస్తుంది.వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 78.27 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ ని షేక్ చేసింది.
Also read: jana Nayagan: నిండా ముంచేశారు కదరా..ట్రేడ్ సర్కిల్స్ చెప్పేది కరెక్టేనా!
హెచ్. వినోత్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించగా పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీ రోల్స్ .అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్
vijay, jana nayakudu, pooja hegde, vinoth, kvn productions





