.webp)
ఇళయ దళపతి, ప్రెజెంట్ తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వన్ మాన్ షో మూవీ ‘జననాయగన్’ (Jana Nayagan). విజయ్ చివరి మూవీ కావడంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 300 కోట్ల నుండి 500 కోట్ల భారీ బడ్జెట్‌తో కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మించగా హెచ్. వినోద్ దర్శకత్వం వహించాడు. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా మొదట ఈ ఏడాది జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుండి సెన్సార్ క్లియరెన్స్ రావడంలో తీవ్ర ఆలస్యం జరగడంతో ఈ సినిమా విడుదల నిరవధికంగా వాయిదా పడుతూ వస్తోంది.
ఈ సినిమా సెన్సార్ వివాదం ప్రస్తుతం న్యాయపోరాటంగా మారింది. డిసెంబర్ 18న సెన్సార్ బోర్డుకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ సర్టిఫికేట్ రాకపోవడంతో, నిర్మాతలు మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. కోర్టు యూ/ఏ (U/A) సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ సీబీఎఫ్‌సీ దీనిపై అప్పీలుకి వెళ్ళింది. అనంతరం సుప్రీంకోర్టు సూచనల మేరకు మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ముందుకు ఈ వ్యవహారం వచ్చింది. ఈ అనిశ్చితి వల్ల ఐదు నెలలకు పైగా సమయం వృధా కావడంతో, డిస్ట్రిబ్యూటర్ల అడ్వాన్స్‌లని వెనక్కి ఇచ్చేందుకు కేవీఎన్ ప్రొడక్షన్స్ సిద్ధమైంది. సినిమా థియేట్రికల్ హక్కులని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని, సెన్సార్ సమస్య ముగిసిన వెంటనే సొంతంగా విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల బుక్‌మైషో, జొమాటో డిస్ట్రిక్ట్ వంటి ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో జూన్ 19న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు అప్‌డేట్స్ కనిపించడంతో ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ వచ్చింది. ముఖ్యంగా జూన్ 22న విజయ్ 52వ పుట్టినరోజు ఉన్నందున, దానికి మూడు రోజుల ముందే థియేటర్లలోకి వస్తుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ వినోద్ ఇటీవల ఒక ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులపై స్పందించేందుకు నాకు ధైర్యం సరిపోవడం లేదంటూ క్రిప్టిక్‌గా వ్యాఖ్యానించారు. దీనికి తోడు విజయ్ పుట్టినరోజు కానుకగా జూన్ 19న 'జననాయగన్' కాకుండా, అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా 'మెర్సల్' (Mersal) దాదాపు 100 థియేటర్లలో రీ-రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించడంతో 'జననాయగన్' జూన్ రేసు నుండి తప్పుకుందనే విషయం స్పష్టమైంది.
Also read: ప్రముఖ యువనటి ఆత్మహత్య.. నవ్వుతు డాన్స్ రీల్ చేసిన నటి
అనిరుధ్ రవిచందర్ సంగీతంలో వచ్చిన "దళపతి కచేరి", "ఒరు పేరే వరలారు" వంటి పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించాయి. పూజా హెగ్డే,బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్, ప్రియమణి వంటి భారీ తారాగణం ఉన్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఖచ్చితంగా థియేటర్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. సెన్సార్ సర్టిఫికేట్ చేతికి వచ్చిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తామని నిర్మాత వెంకట్ కె. నారాయణ అయితే స్పష్టం చేశారు. అభిమానులు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఎందుకు జన నాయగాన్ ని రిలీజ్ చెయ్యడం లేదు. దయ చేసి రిలీజ్ చేయండని కోరుతున్నారు.
.webp)






