
-ఫ్యాన్స్ హంగామా కి కౌంట్ డౌన్ స్టార్ట్
-మేకర్స్ ఏమంటున్నారు
-డేట్ ఇది ఓకే నా!
మొత్తానికి ఇళయ దళపతి 'విజయ్'(Vijay)అభిమానులు గత నెల జనవరి 9 నుంచి 'జన నాయగన్'(Jana Nayagan)రిలీజ్ కోసం చేస్తున్న పూజలు ఫలించే సమయం ఆసన్నమైనట్టుగా, పాన్ ఇండియా సినీ క్లైమెట్ లో సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సారి మాత్రం రిలీజ్ ని ఎవరు ఆపలేరని, సిల్వర్ స్క్రీన్ పై విజయ్ గ్రాండ్ గా కాలు మోపడం పక్కా అని కూడా ట్రేడ్ సర్కిల్ టాక్. మరి అంత కాన్ఫిడెన్స్ ఏంటో చూద్దాం.
జన నాయగన్ లో రాజకీయ పరమైన సీన్స్ ,డైలాగ్స్ ఓవర్ డోస్ లో ఉన్నాయని సెన్సార్ రిలీజ్ కి అడ్డుపడటంతో పాటు సదరు సీన్స్, డైలాగ్స్ తొలగించాలని కోరిన విషయం తెలిసిందే. మేకర్స్ మాత్రం అందుకు ఒప్పుకోకుండా చెన్నైలోని మద్రాస్ హై కోర్ట్ లో పిటిషన్ వేశారు. కానీ మేకర్స్ కే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దీంతో ఈ వివాదాన్ని మరింత లాగితే తమకే నష్టమని భావించిన నిర్మాతలు సెన్సార్ బోర్డు సూచించిన కండిషన్లకి ఓకే చెప్పారని,సెన్సార్ సూచించిన 20 నిమిషాల ఫుటేజ్ తొలగించడంతో పాటు కొన్ని డైలాగ్స్ ని మ్యూట్ చేసి మళ్ళీ సెన్సార్ కి పంపారని తెలుస్తుంది. దీంతో ఎలాంటి కొత్త అభ్యంతరాలు లేకుండా క్లియరెన్స్ లభిస్తే, ఫిబ్రవరి 20న ‘జన నాయగన్’థియేటర్లలోకి రావడం ఖాయమయినట్టుగా పాన్ ఇండియా సినీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
also read: మెహర్ రమేష్ ఇంట్లో విషాదం
హెచ్ వినోద్(H Vinoth)దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన జన జన నాయగన్ లో విజయ్ కి జోడిగా పూజా హెగ్డే(Pooja Hegde)జత కట్టగా ప్రేమలు బ్యూటీ మమిత బైజు(Mamitha Bhaiju)ముఖ్యమైన క్యారక్టర్ లో కనిపిస్తుంది. బాబీ డియోల్ ప్రతి నాయకుడు. తాను రాజకీయాల్లోకి వచ్చినందుకు కక్షపూరితంగా 'జన నాయగన్’ని అడ్డుకుంటున్నారంటూ విజయ్ ఇప్పటికే విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 20 న రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర అభిమానులు చేసే హంగామా ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.







