
గాయత్రీ గుప్త(Gayatri Gupta)నటిగా ఒక మోస్తరు పేరునే తెచ్చుకుంది. కానీ పలు విషయాలపై ఏ మాత్రం మొహమాటానికి పోకుండా బోల్డ్‌గా స్పందిస్తూ ఉంటుంది. కాకపోతే బోల్డ్ మాటలు అని తను భావించకపోవడం గాయత్రీ గుప్త స్టైల్. ఆ కోవలోనే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో 'హగ్' "మెంటల్ పీస్" గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గాయత్రీ గుప్త మాట్లాడుతు ఒక వ్యక్తి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా బాధలో ఉన్నప్పుడు, వారు ప్రేమించే వ్యక్తి ఇచ్చే ఒక చిన్న కౌగిలింత ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. అది కేవలం శారీరకమైన సుఖం కోసం మాత్రమే కాదు, మనసుకి ప్రశాంతతని ఇచ్చే ఒక మెడిసిన్. ఒక మనిషి తాను సుఖంగా ఉన్నానని బావించాలంటే రోజుకి ఎనిమిది నుంచి పన్నెండు హగ్గులు అవసరం.పైగా ఆ హగ్గు వెంటనే విడిపోకుండా కనీసం ఇరవై సెకన్ల పాటు ఆ టచ్ ఉండాలి. దాంతో నైట్ ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
Also read: MOuni Roy: విడాకులు తీసుకోబోతున్నారా!.. రీసెంట్ గా చిరుతో స్పెషల్ సాంగ్
ఈ హగ్గులు కుటుంబ సభ్యులైన అమ్మ, నాన్న, సోదరి సోదరీమణుల నుంచి పొందితే బెస్ట్ అని చెప్పుకొచ్చింది. గాయత్రి చేసిన ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె చెప్పిన దాంట్లో శాస్త్రీయ కోణం ఉందని ( హగ్ చేసుకున్నప్పుడు ఆక్సిటోసిన్ విడుదల వంటివి) మద్దతు తెలుపుతుంటే, మరికొందరు బోల్డ్ స్టేట్‌మెంట్ అని విమర్శిస్తున్నారు.






