Home

»

Latest News

పరశురామ్ దర్శకత్వంలో నందమూరి హీరో.. హిట్ ఖాయమేనా!

Jul 22, 2026 2:50PM


ఫ్యామిలీ సబ్జెక్ట్స్ కి తనదైన శైలిలో నవ్వులని,సెంటిమెంట్ ని పండించే దర్శకుడు పరశురామ్. సోలో, గీత గోవిందం వంటి చిత్రాలే ఒక ఉదాహరణ. కమర్షియల్ గా కూడా తన సత్తా చాటాలని సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాటని తెరకెక్కించి తన స్టేటస్ ని పెంచుకున్నాడు. విజయ్ దేవరకొండతో చేసిన ప్రీవియస్ మూవీ ఫ్యామిలి స్టార్ తో పరాజయాన్ని అందుకున్నాడు. 

పరశురామ్ తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్‌ని కలిసి  పూర్తి స్థాయిలో కథ వినిపించినట్లు సమాచారం. పరశురామ్ కథను వివరించిన విధానం, ఆయన మార్క్ నరేషన్ కళ్యాణ్ రామ్‌కి బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌పై  పాజిటివ్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే, కథ మరింత పక్కాగా ఉండాలని భావించిన కళ్యాణ్ రామ్, స్క్రిప్ట్‌లో కొన్ని చిన్న చిన్న మార్పులు సూచించినట్లు టాక్ .కళ్యాణ్ రామ్ ఇచ్చిన సూచనల మేరకు పరశురామ్ ప్రస్తుతం స్క్రిప్ట్‌పై మరోసారి రీవర్క్ చేస్తున్నారని కూడా అంటున్నారు.

Also read: చిరు, బాబీ మూవీ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుందా.. రీజన్ ఇదేనా!

ఒకవేళ ఈ స్క్రిప్ట్ చర్చలు ఫలించి కథ అనుకున్నట్లుగా కుదిరితే, ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కడం ఖాయమని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని నిర్మించేందుకు దిల్ రాజు ముందుకొచ్చినట్లు తెలిసింది. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

kalyan ram, parasuram, tollywood, mahesh babu

 


 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com