ఛాంపియన్ ఓటిటి డేట్ ఇదే
on Jan 24, 2026

-ఇక ఓటిటి లవర్స్ లో పండుగే
-నెట్ ఫ్లిక్క్ ఏమంటుంది
-రోషన్ పెర్ ఫార్మ్ హైలెట్
శ్రీకాంత్ తనయుడు రోషన్(Roshan)సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటిన మూవీ 'ఛాంపియన్'(Champion).క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25 న విడుదలయ్యింది. ఇండియాకి స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం నవాబు ఇండియాలో వీలినం చేయకపోవడానికి గల కారణాలకి, సిద్ధిపేట జిల్లాలోని భైరాన్ పల్లి లో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటానికి, ఇంగ్లాండ్ లో ఫుట్ బాల్ ప్లేయర్ గా సెటిల్ అవ్వాలన్న మైకేల్ విలియమ్స్ అనే యువకుడికి మధ్య సంబంధం ఏంటనే మూడు విభిన్నమైన పాయింట్స్ తో తెరకెక్కింది. మైకేల్ విలియమ్స్ గా రోషన్ పెర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో సాగడంతో పాటు, మూడవ చిత్రంతోనే అత్యుత్తమ ప్రతిభ కనపర్చడానే కితాబుని అభిమానులు, ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి అందుకున్నాడు.
ఇప్పుడు ఈ మూవీ ఓటిటి వేదికగా ఈ నెల 29 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా సందడి చేయనుంది. రోషన్ తో పాటు హీరోయిన్ గా చేసిన అనశ్వర రాజన్, నందమూరి కల్యాణ చక్రవర్తి, ప్రకాష్ రాజ్, సంతోష్ ప్రతాప్ పెర్ ఫార్మెన్స్ ఛాంపియన్ కి సరికొత్త లుక్ ని తీసుకొచ్చింది. ప్రదీప్ అద్వైతం(Pradeep Advaitham)నుంచి వచ్చిన కథ, కథనాలు, డైరెక్షన్ ఛాంపియన్ ద్వారా సరికొత్త లోకం ప్రేక్షకుల కళ్ల ముందు మెదలాడటం ఖాయం. మిక్కీ జె మేయర్ అందించిన మ్యూజిక్ కూడా అద్భుతం.
Also read: పోలీస్ స్టేషన్ కి ఎస్ కె ఎన్.. అంతా రాజాసాబ్ నే చేసాడు
ముఖ్యంగా గిర గిర గింగిరాగిరే సాంగ్ పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. కాంప్రమైజ్ కానీ ప్రియాంక దత్, జి కె మోహన్, జెమినీ కిరణ్ నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి. ఈ నేపథ్యంలో ఓటిటి సినీ ప్రేమికుల్లో ఛాంపియన్ మూవీతో సరికొత్త జోష్ వచ్చినట్లయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



