The raja saab: పోలీస్ స్టేషన్ కి ఎస్ కె ఎన్.. అంతా రాజాసాబ్ నే చేసాడు
on Jan 24, 2026

-ఎస్ కె ఎన్ కీలక నిర్ణయం
-పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది
-నెక్స్ట్ ఏం జరగబోతుంది.
పాన్ ఇండియా రెబల్ స్టార్ 'ప్రభాస్' రాజాసాబ్(The RajaSaab)తో థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కాకపోతే అభిమానులు, ప్రేక్షకులని పూర్తి స్థాయిలో మెప్పించే విషయంలో రాజాసాబ్ వెనకపడ్డాడని చెప్పవచ్చు. బాక్స్ ఆఫీస్ వద్ద నమోదవుతున్న కలెక్షన్స్ నే అందుకు ఉదాహరణ. కొన్ని రోజుల నుంచి రాజాసాబ్ తో పాటు దర్శకుడు మారుతి(Maruthi),క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఎస్ కె ఎన్(Skn)పై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ జరుగుతున్నాయి. ఆ ట్రోల్ల్స్ చేస్తున్న వాళ్ళల్లో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఉన్నారనే మాటలు సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఎస్ కె ఎన్ అయితే సదరు ట్రోల్స్ పై ఘాటుగానే రిప్లై ఇచ్చినట్టుగా స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఎస్ కె ఎన్ సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తన ఫిర్యాదులో ' సోషల్ మీడియాలో రాజాసాబ్ ని అందులోని నటులని లక్ష్యంగా చేసుకుని అవమానకరమైన, తప్పుదారి పట్టించే పోస్టులని నేను చేస్తున్నట్టుగా చేస్తున్నారు. ఇటువంటి దురుద్దేశపూరిత చర్యలు గందరగోళాన్ని సృష్టించడమే కాదు, నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తాయి.ఈ పోస్టులు చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల ని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ట్రోల్ చేస్తున్న కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ స్క్రీన్ షాట్స్ ని కూడా ఎస్ కె ఎన్ పోలీసులకి ఇవ్వడం జరిగింది.
Also read: ఇంటిపై ప్రముఖ నటుడి కాల్పులు.. లోపల ఎవరున్నారో తెలుసా!
రాజాసాబ్ రిలీజ్ కి ముందు జరిగిన చాలా ఫంక్షన్స్ లో ఎస్‌కేఎన్ రాజా సాబ్ గురించి చెప్పిన మాటలు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో నూతన ఉత్సాహాన్ని తెచ్చాయి. మూవీ పై అంచనాలు కూడా బాగా పెరిగాయి. ప్రతి సంక్రాంతికి పందాలు కోళ్లపై వేస్తే, ఈసారి డైనోసార్ మీద వెయ్యండి అంటు చెప్పిన మాట ఎస్ కె ఎన్ పొగడ్తల పర్వంలో ఒకటి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



