Home  » Movie-News » మరో వివాదంలో హృతిక్ రోషన్..!



బాలీవుడ్ కండల కాంతారావు హృతిక్ రోషన్ కు టైం బాగున్నట్టు లేదు. ఇప్పటికే భార్య నుంచి విడాకులు, కంగనాతో కేసులు అంటూ సతమతమవుతున్న హృతిక్ మెడకు లేటెస్ట్ గా మరో వివాదం చుట్టుకుంది. పాపం ఏదో క్యాజువల్ గా మనోడు చేసిన ఒక ట్వీటే ఇప్పుడు కొత్త వివాదంగా మారింది. ఎప్పటికప్పుడు ఏదో ఒక స్టార్ తో తనను లింక్ చేసే మీడియాపై ఏదో సెటైర్ వేద్దామనుకుని గోతిలో పడ్డాడు. మీడియా నాకు అఫైర్ ఉన్నట్టు చెబుతున్న ఆ అందమైన మహిళలకన్నా, పోప్ తో అఫైర్ తో ఉండే ఛాన్సులే ఎక్కువ ఉన్నాయి అని హృతిక్ ట్వీట్ చేశాడు.

అంతమందితో అఫైర్ ఉండే పాజిబిలిటీ అస్సలు లేదు కదా అని డైరెక్ట్ గా చెప్పే బదులు, దాని కన్నా పోప్ తో అఫైర్ అంటే నమ్మొచ్చు అని హృతిక్ ఉద్దేశం. పోప్ ను కించపరచడం అక్కడ అతని అభిమతం కాకపోయినా, నీ ఉద్దేశంతో మాకు పనేంటి అన్నట్టుగా, హీరోగారి మీద కేస్ ఫైల్ చేసేశారు ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ అధ్యక్షుడు అబ్రహం మథాయ్. పోప్ కు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని, పోప్ పేరును ఇలాంటి విషయాల్లో వాడటం తమ మనోభావాల్ని దెబ్బ తీసిందని, ఆయన నోటీస్ లో పేర్కొన్నారు. ఇప్పటికే కంగనా విషయంలో చాలా చికాకులు ఎదుర్కొంటున్న హృతిక్, ఈ తాజా వివాదాన్ని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.