Home  » Movie-News » ఇది శ్రీజ కళ్యాణ్ ల కంప్లీట్ పెళ్లి వీడియో..!



 

కూతురి పెళ్లిని, ఈ ఏడాదిలోనే అత్యంత భారీ పెళ్లిళ్లలో ఒకటిగా చేయించారు మెగాస్టార్. అసలు ఎక్కడా తగ్గకుండా మెగా స్థాయిలో జరిగిన ఈ పెళ్లి గురించి ఇప్పటి వరకూ అభిమానులు అక్కడో ఇక్కడో పైరసీ టైప్ వీడియోలను చూసి ఆనందించారు. బహుశా తమ అభిమానులకు కానుకగా క్వాలిటీ వీడియోను రిలీజ్ చేయాలనుకున్నారో ఏమో, పెళ్లికి సంబంధించిన కంప్లీట్ విశేషాలను, చిన్నగా చేసి మెయిన్ ఈవెంట్స్ అన్నింటినీ చూపిస్తూ వీడియో రిలీజ్ చేశారు.

ప్రస్తుతం సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు అభిమానులు. ఈ పెళ్లి కోసమే ప్రత్యేకంగా పాట చేయించినట్టున్నారు. అల్లుడికి చిరు దంపతులు కాళ్లు కడగడం నుంచి, అందరూ వధూవరుల్ని ఆశీర్వదించడం, తలంబ్రాలు, ఉంగరాల కోసం పోటీ లాంటివన్నీ ఈ వీడియోలో కనిపిస్తాయి.

సినిమా ఫీల్డ్ కు సంబంధించి వచ్చిన వాళ్లలో చిరుకు ఒకప్పటి హీరోయిన్ అయిన సుమలత మాత్రమే కనిపించింది. చిరు ఫ్యామిలీ అంతా గ్రూప్ గా ఫోటోకు స్టిల్ ఇవ్వడం దగ్గర వీడియో ముగుస్తుంది. ఈ పెళ్లితో చిరుకు అన్ని భారాలూ తీరిపోయాయని చెప్పచ్చు. ఇక తర్వాత నుంచి, ఆయన ప్రశాంతంగా తన 150 వ సినిమాపై దృష్టి పెట్టచ్చు. ఆ సినిమా కోసం ఇప్పటి నుంచి ఆయన అభిమానుల ఎదురుచూపులు మళ్లీ మొదలవుతాయనడంలో డౌట్ లేదు.