
తొంభయ్యవ దశకంలోనే తెలుగు సినిమా గర్వించదగ్గ సినిమాల్ని నిర్మించిన నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి(Shyam Prasad Reddy)సౌందర్య ,సురేష్ లు జంటగా రమ్యకృష్ణ అమ్మవారిగా చేసిన అమ్మోరు(ammoru)సినిమానే అందుకు ఉదాహరణ.ఆ తర్వాత వచ్చిన అరుంధతి(arundathi)కూడా ఎంతటి చరిత్రని సృష్టించిందో అందరకి తెలిసిందే . ఒక రకంగా గ్రాఫిక్స్ కి స్టార్ డమ్ తీసుకొచ్చింది కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి నే. ఇప్పుడు ఆయన ఇంటిలో తీవ్ర విషాదం నెలకొంది.
శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య పేరు వరలక్ష్మి. గత కొన్ని రోజుల నుంచి క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె అందుకు సంబంధించిన ట్రీట్ మెంట్ ని కూడా తీసుకుంటుంది. కానీ చివరకి పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు దీంతో శ్యాం ప్రసాద్ రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వరలక్ష్మి గారి వయసు అరవై రెండు సంవత్సరాలు. ఆమె సమైక్య ఆంధ్రప్రదేశ్ కి సిఎం గా పని చేసిన కోట్ల విజయభాస్కర రెడ్డి గారి ముగ్గురు కూతుళ్ళల్లో ఒకరు.ఆమె సోదరుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరుపున ఎంఎల్ఏ గా ఉన్నారు.
ఇక శ్యామ్ ప్రసాద్ రెడ్డి తండ్రి ప్రముఖ నిర్మాత, రచయిత అయిన ఎంఎస్ రెడ్డి(msreddy)కూడా కొంత కాలం క్రితం చనిపోయారు.ఆయన కలం పేరు మల్లెమాల.. ఆ పేరుతోనే శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రస్తుతం పలు టి వి షోస్ ని నిర్మిస్తున్నారు.పైగా అవన్నీ బుల్లి తెర ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాయి. జబర్దస్త్ నే అందుకు ఉదాహరణ.చిరంజీవి హీరోగా వచ్చిన అంజి కి కూడాశ్యామ్ ప్రసాద్ రెడ్డి నే నిర్మాత.