
సోషల్ మీడియాలో యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున(akkineni nagarjuna)మొదటి నట వారసుడు ఎవర్ గ్రీన్ హీరో నాగ చైతన్య(naga chaitanya)పర్సనల్ లైఫ్ కి సంబంధించిన న్యూస్ ఒకటి హల్ చల్ చేస్తుంది. ఒక రకంగా ఆ న్యూస్ ని అతి పెద్ద గాసిప్ అని కూడా చెప్పవచ్చు.
శోభిత ధూళిపాళ్ల(sobhita dhulipala)ని నాగ చైతన్య త్వరలోనే పెళ్లి చేసుకోబుతున్నాడని, అందుకు సంబంధించి ఈ రోజు నిశ్చితార్ధం కూడా జరగబోతుందనే ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కానీ ఈ విషయం మీద అక్కినేని కుటుంబ సభ్యుల నుంచి కానీ శోభిత కుటుంబ సభ్యుల వైపు నుంచి కానీ ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.
ఇక శోభిత,చైతు లు ఎప్పటినుంచో స్నేహితులుగా ఉన్నారు.
ఇక శోభిత 2013 లో ఫెమినా నిర్వహించిన మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత పలు తెలుగు తమిళ, హిందీ,మలయాళ, ఇంగ్లీష్ సినిమాల్లో నటనకి అవకాశమున్న పాత్రల్ని పోషించి మంచి పేరు సంపాదించింది. అడవి శేషు హీరోగా వచ్చిన గూఢచారి లో కూడా చేసింది. ఇక చైతు ప్రెజంట్ తండేల్(thandel)లో బిజీగా ఉన్నాడు.