Home » Comedy Stories » నవ్వులో శివుడున్నాడురా

నవ్వులో శివుడున్నాడురా

 

 

దివాకరబాబు

 

" నవ్వులో శివుడున్నాడురా " అన్నారు పెద్దలు.

 

శివుడంటే గుర్తొచ్చింది.

 

స్థలం: కైలాసం

 

సమయం : ఒకప్పుడు ఓసారి శివుడ్ని ఉడికించాలని పార్వతి ఓరగా శివుడి వంక

 

చూస్తూ...”నాకూ నాన్న వున్నాడు. మీకు లేడుగా...”అందిట.

 

అప్పుడు శివుడు అరనవ్వు నవ్వి " నాకు మామ ఉన్నాడు నీకు లేడుగా "అని

 

చమత్కారించాట్ట. ఇద్దరూ మంచల్లే హాయిగా నవ్వుకున్నార్ట. అలా విష్ణులోకం,

 

బ్రహ్మలోకం, ఒకటేమిటి అన్ని లోకాల్లో హాస్యం ఓలలాడుతుండేదిట!

 

 

స్థలం : కైలాసం,

 

సంవత్సరం : 2001 మంచు కొండల మీదనించి వీచే గాలి గిలిగిలింతలు పెడుతున్నా

 

ఎవరూ నవ్వడం లేదు.

 

శివ పార్వతులతో సహా అంతా గంభీరంగా వున్నారు.అంతలో నారదుడు వడివడిగా

 

నడుస్తూ హడావుడిగా వచ్చాడు.

 

“నారాయణ....!పరమేశా !వున్న పాటున రమ్మన్నారట ఏమిటి విశేషం ? ”

 

ఉపోద్ఘాతాలు లేకుండా సూటిగా పాయింట్ కీ వచ్చాడు శివుడు.

 

“నారదా... కాసేపు నవ్వించవయ్యా " అదిరిపడ్డాడు నారదుడు.

 

నెత్తిమీద పిడుగు పడ్డట్టు ఫీలయ్యాడు. వినకూడని మాట విన్నట్టు ఫ్రీజ్

 

అయిపోయాడు...సరిగ్గా వినలేదేమోనని డౌట్ పడ్డాడు.ఎందుకన్నా మంచిదని "స్వామి..

 

నేను విన్నది...” అంటూ గొణిగాడు.

 

“నేను అన్నదే "

 

“ఇంకోసారి అనండి "

 

“కాసేపు నవ్వించవయ్యా " చిడతలు పడేసి నారదుడు రెండు చెవులూ మూసుకున్నాడు.

 

“నారాయణ నారాయణ...నవ్వించాలా..ఇదేం విపరితమైనా కోర్కె దేవా...మన దేవలోకాల్లో

 

నవ్వు అన్నది దుర్భిణీ వేసి వెతికినా దొరకనిదై పోయింది కదా...నవ్వు అన్నది కేవలం

 

ఒక మాటగా మిగిలిపోయింది. ఎవరి పెదాల మీదా కనిపించనంత అపురూపమై పోయింది

 

కదా దేవా !నవ్వడం మరిచిపోయిన నేను మిమ్ముల్ని ఎలా నవ్వించగలను

 

ఆదిదేవా...ఆశక్తుడ్ని.. నన్ను మన్నించు...” శివుడు నిరాశపడి తిరిగి గంభీర ముద్ర

 

దాల్చాడు.

 

“నేను నవ్వించమంటే నవ్వించావా " అని శివుడు మూడో కన్నుతెరిచి భస్మం

 

చేస్తాడేమోనని భయపడి అక్కడి నుండి జారుకున్నాడు నారదుడు...కిందపడిన చిడతలు

 

తీసుకుని మరీ !

 

స్థలం : బ్రహ్మలోకం.

 

రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదు అన్నట్టు బ్రహ్మలోకం వెళ్ళినా నారదుడికి బాధ

 

తప్పలేదు. బ్రహ్మ కూడా నారదుడిని నవ్వించమని బ్రతిమాలాడు. మూడు తలలు

 

నవ్వక్కర లేదు.ఒక తల నవ్వినా చాలని రిక్వెస్ట్ చేసాడు. ఇంకాసేపు అక్కడే వుంటే వీణ

 

లాక్కుని వీపు మీద వాయించి పంపుతాడేమోనని భయపడి పారిపోయాడు.

 

స్థలం : విష్ణులోకం

 

పాల కడలిలో పడుతూ లేస్తూ "పాహిమాం.... పాహిమాం...”అంటూ నారదుడు వచ్చాడు.

 

శివుడు,బ్రహ్మ తనని నవ్వించమని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందీ వివరించాడు.అంతా విన్న

 

శ్రీ మహావిష్ణువు నవ్వలేదు. అర్జంటుగా ముక్కోటి దేవతల జనరల్ బాడీ మీటింగ్ ఎరేంజ్

 

చేయించమన్నాడు.

 

స్థలం : దేవతలా కమిటీ హాలు.

 

మూడు కోట్లా కిరీటాలతో సభ కిటకిటలాడిపోతోంది.ఎవరి నోట విన్నా ఒకటే మాట...'నవ్వు

 

'! “ నవ్వా ? ”

 

“ అంటే ఏంటి ? ”

 

“ నువ్వెప్పుడైనా నవ్వావా ? ”

 

“నవ్వంటే ఎలా వుంటుంది ? ” తలో రకంగా అనుకుంటున్నారు.పక్కవాళ్ళని

 

అడుగుతున్నారు.

 

“ నవ్వంటే ఆయుధమా? లేకపోతే అమృతంలా తాగే పాయసమా ? ” అని పిల్లదేవుడికి

 

ఒకడికి సందేహం వచ్చింది. గతంలో నవ్వంటే తెలిసిన పెద్దదేవుడు పిల్లదేవుడి మాట

 

వినికూడా నవ్వలేక పోయాడు. వక్తలు సుదీర్ఘ ప్రసంగాలు చేసారు. మనకి ఎలాగైనా నవ్వు

 

కావాలని తీర్మానించారు.

 

“ కావాలి సరే ఎక్కడ్నించి తేవాలి నవ్వుని " అని బ్రహ్మదేవుడు అడిగాడు.

 

అప్పటిదాకా బ్రహ్మదేవుడు 'నవ్వు 'ని సృష్టిస్తాడన్న ఆశతో వున్నాదేవ్వుళ్ళు బ్రహ్మ అలా

 

అడిగేసరికి డీలా పడిపోయారు. అప్పటి వరకూ మౌనంగా వున్నా యముడు లేచి

 

నిలబడ్డాడు.వేదిక మీదకి వచ్చాడు. గొంతు సవరించుకున్నాడు. సభా సదులని నిశ్శబ్దంగా

 

వుండమన్నాడు.

 

“ నవ్వుని దేవలోకం తీసుకొచ్చే చిట్కా చెప్తా " అన్నాడు.

 

అందరూ ఆశ్చర్యంగా చూసారు. చెవులు రిక్కించారు. “మనకి నవ్వు కావాలంటే మనం

 

హత్య చెయ్యాలి "

 

' హత్యా !' మూడు కోట్లా కంఠాలు ఆశ్చర్యంటో ఆందోళనతో ఒక్కసారిగా అరిచాయి.

 

స్థలం : భూలోకం, యశోద హాస్పటల్.

 

తేది : 19-06-2001 బ్రహ్మ సృష్టించలేని నవ్వులని సృష్టించిన హాస్య బ్రహ్మ

 

జంధ్యాలగారు... ప్రాణాలు కాపాడే ఆ దేవాలయంలోకి వచ్చారు.పాపం ఆయనకి తెలియదు

 

.హాస్యం కోసం దేవుళ్ళు అక్కడ కావు కాసి వున్నారని. సాహితీ సంపదలతో పచ్చగా

 

వున్న జంధ్యాల గారి మీద పాశం విసిరారు దేవుళ్ళు...!అంతే..! నవ్వుల్ని పంచే అక్షయ

 

పాత్ర పగిలిపోయింది.తెలుగువాడి దగ్గర్నుంచి నవ్వు చేజారిపోయింది. నవ్వుకి బోలెడంత

 

దుఃఖం వచ్చింది.

 

 

స్థలం : స్వర్గ లోకం

 

 

సమయం : 19-06-2001 నుంచీ... చిరునవ్వులతో జంధ్యాల గారు దేవుళ్ళకి

 

చెప్తున్నారు.

 

“ నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వలేక పోవడం ఒక రోగం....”

 

మనుష్యుల్ని ఏడిపించి దేవుళ్ళు హాయిగా నవ్వుకుంటున్నారు. హ...హా....!!