Home » Comedy Stories » ఖామెడీ కథ

' ఖామెడీ కథ '

 

-యం.వి.యస్.హరనాథరావు

 

ఆ సిన్మా కంపెనీలో అందరూ తెగ నవ్వేస్తున్నారు.మలేరియా పట్టినట్లు అందరికి కామెడీ

 

పట్టింది.కారణం ఏంటంటే -ఓ రైటర్ నవ్వించే సిన్మాకు కథ చెప్తానని ఆఫీసుకొచ్చాడు.

 

కామెడీ రైటర్...టీ పీల్చి,సిగరెట్టు చప్పరించాక, సిన్మా తాలూకూ దర్శకనిర్మాతలిద్దరూ కథ

 

వినడానికి చెవులు శుభ్రం చేయించుకుని కూర్చున్నారు. కామెడీ రైటర్ నవ్వాడు.ఆయన

 

గారి పళ్ళు కార్టూన్లలా కనిపించాయి.

 

 

“కథ చెప్పండి "దర్శక నిర్మాతలు నవ్వుతూ అడిగారు.

 

“నవ్వే కథ, కథే నవ్వు. నవ్వులేకుండా కథలేదు.కథ లేకుండా నవ్వులేదు.”అంటూ తెగ

 

నవ్వేస్తున్నాడు సదరు రైటర్.

 

“ ఓహో నవ్వుకథా "అంటూ దర్శకనిర్మాతలిద్దరూ ఆఫీసంతా దొర్లి దొర్లి నవ్వుకున్నారు.

ఇలా రోజూ దొర్లి దొర్లి నవ్వితే ఆఫీసు చిమ్మేపని తప్పుతుందని అనుకున్నాడు

ఆఫీసుబాయ్.

 

“కథ విన్నావట్రా " అడిగారు ఆఫీసుబాయ్ ని.

 

“ఆయనగారు చెప్తే కదండీ వినడానికి "

 

“నవ్వుకు కథేంట్రా...రైటర్ నవ్వాడు.మేం నవ్వాం.వొచ్చినవాళ్ళు కామెడీ కథట కదా అని

 

నవ్వుతున్నారు కథ విన్న హీరోగారు...అవుట్ డోర్ అన్న సంగతి మరిచిపోయి-

 

తెగనవ్వేశాడు. నీవు నవ్వు నరం లేకుండా పుట్టావురా "అంటూ బూతులతో కొట్టాడు.

 

ఆఫీసుబాయ్ కి అర్థం కాలేదు.ఆఫీసుకు ఎవరొచ్చినా,'కథేంటి' -'కామెడీనా'-'కాదు

 

నవ్వుకథ' '

 

“ ఓహో అర్థమైంది...కామెడీని తెలుగులో తీస్తున్నారన్నమాట "అంటూ తెగ

 

నవ్వేస్తున్నారు.

 

 

కథ లేకుండా,తెలియకుండా అందరూ నవ్వేస్తున్నారు. ఆఫీసుబాయ్ కి పిచ్చేక్కుతోంది.

 

జుత్తు పీక్కున్నాడు.కేశ వర్ధిని తైలం వాడటం వల్ల జుత్తు వూడి అతని బాధకు సింబాలిక్ గా

 

ఉపయోగ పడలేదు.కథ చెప్పకుండా అందరిని నవ్విస్తున్న రైటరు చాలా

 

దుర్మార్గంగా,దేవుళ్ళ సిన్మాల్లో బూతుజోకులా కనిపించాడు.

 

 

ఆ రైటర్ సంగతి తేల్చుకోవాలి. ఆఫీసుబాయ్ ఆలోచించాడు. లోపల నవ్వులు

 

వినిపిస్తున్నాయి.

 

 

“మన కథకు విశ్రాంతి దగ్గర శుభం వేస్తాం.శుభం దగ్గర విశ్రాంతి వేస్తాం.ఇంతకంటే కథ ఏ

 

సిన్మాకు వుంది ? ” అందరూ మళ్ళీ కిందపడి దొర్లుతున్నారు.

 

ఈ దుర్మార్గం ఆపాలి.ఆఫీసుబాయ్ లో ఆలోచనలు. అందరికీ టీలు ఇచ్చాడు. అందరూ టీ

 

కప్పులు చూచారు.

 

 

“ఇందులో టీ ఏదిరా "

 

 

“ కథ వినకుండా నవ్వుతున్నప్పుడు, టీ లేకుండా కప్పును తాగలేరా"

 

 

“ బావుంది.ఈ జోకు మన సిన్మాలో వాడుకుందాం . సెన్సారు సర్టిఫికెట్టు మీద పోస్టు

 

 

చేద్దాం "

 

 

“ సెన్సార్ సర్టిఫికెట్టు మీదనా "అందరూ మళ్ళీ నవ్వారు.

 

 

ఆఫీసుబాయ్ కూడా నవ్వాడు.

 

 

“ చూశారా! మన కథ మొదలైనప్పటినించి నవ్వని వాడు నవ్వాడంటే ఇంతకంటే సిన్మాలో

 

కామెడీ ఏం కావాలి " బాయ్ నవ్వింది ఎందుకో తెలియదు.

 

 

ఖాళీ కప్పుల్లో టీలు తాగిన అందరూ "ఇలాంటి టీ ఎప్పుడూ తాగలేదు.రోజూ ఇలాంటిదే పట్రా

 

-సిన్మా అయ్యేంతవరకు "అన్నారు.

 

 

ఆఫీసు కుర్రాడికి పిచ్చెక్కింది.

 

 

“ లాభం లేదు...ఏదో వొకటి చేస్తేగాని చిర్నవ్వు-అంతే.” ఆఫీసుకు టెలిగ్రాం వొచ్చింది.

 

 

ఆ టెలిగ్రాం ఇచ్చిన ఆఫీసుబాయ్ అందుకున్నాడు...రైటర్ గారి దగ్గరకు వెళ్లాడు.ఈ టెలిగ్రాం

 

చూచయినా నవ్వులు ఆగిపోవాలి. “సార్...ఇది

 

ఏడుపు...దుఃఖం...బాధ...విషాదం...టెలిగ్రామ్ -మీ అమ్మగారు పోయారట " అందరి

 

నవ్వులు ఆగాయి. రైటర్ టెలిగ్రాం అందుకున్నాడు.చూచాడు.

 

 

గిలగిల...గలగల...ఫెళపెళ...నవ్వాడు.

 

 

“విషాదంలో కూడా నవ్వా "

 

 

“కాదామరి, మా అమ్మ 15ఏళ్ళ క్రితం...నా కామెడీ కథ చదివి...నవ్వలేక గుండె

 

ఆగిపోయింది.అప్పుడిచ్చిన టెలిగ్రాం ఇప్పుడొచ్చింది ". అందరూ మళ్ళీ నవ్వారు.

 

 

ఆఫీసు కుర్రాడి అయోమయం ఆప్గానిస్తాన్ లో పడింది. ఆగని నవ్వులు...పెరిగిన

 

నవ్వులు...పెరగడం ఆగని నవ్వులు,సిన్మా ప్రయత్నాలు... సాగుతున్నాయి. తెగ నవ్వించే

 

సిన్మా అని పత్రికలు రాస్తున్నాయి. నిజమే -కథలేకుండా సిన్మా తీయడం నవ్వేకదా !

 

సినిమా తీశారు. సెన్సారు వాళ్ళు చూచారు.

 

 

కామెడీ కథ అని టైటిల్స్ లో వున్నది కట్ చెయ్యమన్నారు. కామెడీ అని చదివితే ' కామం

 

' అన్న పదం గుర్తుకొస్తోంది కాబట్టి దాన్ని 'ఖామెడీ ' గా మర్చమన్నారు. జనం సినిమా

 

మీద పడ్డారు.సినిమా జనం మీద పడింది.

 

 

సిన్మా చూసిన జనం ఇళ్లకు వెళ్లారు. ఇంటికి రాగానే...వో భర్త... భార్య కాళ్ళ మీద పడ్డాడు.

 

“ఇదేంటండీ-నవ్వు సిన్మాకు వెళ్లొచ్చి నా కాళ్ళకు నమస్కారం చేస్తారా "

 

 

“అలా అనకు, నీలాటి పెళ్ళికాని భార్యను ఇంట్లో పెట్టుకుని...నలుగురు పిల్లలున్నారన్న

 

సంగతి మర్చిపోయి, నీకు పెళ్లి చెయ్యకుండా ఖామెడీ సిన్మాలు చూస్తున్న దుర్మార్గుడ్ని...

 

నీకు పెళ్లి చేసి...నీకు తండ్రిలేని లోటు నీ బిడ్డలకు భర్తలేని లోతు తీరుస్తా " అన్నాడు.

 

 

సిన్మా చూసిన వో స్టూడెంట్ ఇంటికి రాగానే తండ్రి దగ్గరకు వెళ్లాడు. “ డాడీ...నా కోర్కె

 

తీర్చవూ "

 

“ఏంట్రా అది "

 

“టాంక్ బండ్ లో బుద్ధ విగ్రహం వుంది కదా "

 

“ వుంటే "

 

“ ఆ విగ్రహానికి ఆ సైజులో పట్టుబట్టలు కట్టబెడతానని మొక్కుకున్నాను.అవును

 

నాన్నగారూ ఖామెడీ సిన్మాకు వెళ్లి క్షేమంగా తిరిగివచ్చాను.నా మొక్కు తీర్చండి.”

 

ఆంధ్రప్రదేశంలో సంచలనం.

 

కారణం -ఖామెడీ సిన్మా ఆడుతున్న హాళ్ళన్నీ ఖాళీగా వున్నాయట. నిర్మాత, దర్శకుడు,

 

రచయితలకు ఆంధ్ర ప్రేక్షకులు అర్థం కాలేదు. ఖామెడీ సిన్మాలకు కాలం చెల్లిపోయిందా !

 

ఇపుడు కలెక్షన్లు ఎలా పెంచాలి. యాష్ ట్రే అనుకుని సిగరెట్టు బుర్రమీద రుద్దాడు రైటర్.

 

అంతే బుర్ర ఆలోచనను వాంతి చేసుకుంది.

 

 

మర్నాడు పేపర్లో... నవ్వు సిన్మా చూసి కథ రాసిన వాళ్లకు ' ఐదులక్షల బహుమానం '.

 

అంతే...జనం విరగబడ్డారు.అనారోగ్యం గురించి ఆలోచించకుండా, కథలేని సినిమా కథ

 

వూహించి, కథ రాసిన ప్రేక్షక దేవుళ్ళు పంపిన కథలతో ఆఫీసు నిండింది.

 

బహుమానం...నిర్ణయించే కమిటీలో ఆఫీసుబాయ్ ని వేశారు.చివరకు ఓ కవర్ దొరికింది.

 

 

అందులోని కాగితాలు అందరూ చూశారు...సెభాష్ అనుకున్నాను.కథలేని సినిమాకు

 

కథను రాసిన ఆ ప్రేక్షకుడికే ' ఐదులక్షల బహుమానం 'అన్నారు. ఆ కథ హక్కులు

 

కొనడానికి ఇతర భాషల వాళ్ళు ఊళ్లోకి దిగిపడ్డారు.కథ కోసం ఎగపడ్డారు. ఆ

 

కాగితాలు...అందరికీ చూపించారు. హాశ్చేరియం...ఖామెడీ... అవి తెల్ల కాగితాలు...వొట్టి

 

తెల్లకాగితాలు...శ్రీరామా అని కూడా రాయని తెల్లకాగితాలు.