Home » Jokes » అమెరికన్ టూరిస్ట్

 

అమెరికన్ టూరిస్ట్

 

 

ఓ అమెరికన్ టూరిస్ట్ కోనసీమకి వచ్చాడు. ఒక గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఒక

 

షాపులో కొబ్బరి బొండాలు కనబడ్డాయి.

 

" మంచి వాటర్ ఉన్న ఒక కొబ్బరి బొండాన్ని కొట్టివ్వు " అన్నాడు టూరిస్ట్.

 

" అలాగే సర్ " అని ఒక కొబ్బరి బొండం కొట్టించాడు ఆ షాపు అతను.

 

టూరిస్ట్ ఆ కొబ్బరి బొండాన్ని తాగి " రేటెంత ? " అని అడిగాడు.

 

" రెండొందలు " అని చెప్పాడు ఆ షాపు అతను.

 

" వాట్....ఒక్క కొబ్బరి బొండాం రెండొందలా..? అంతరేటేమిటి ? పైగా ఇక్కడ

 

కొబ్బరిబొండాలు ఎక్కువే దొరుకుతాయనుకుంటాను " అని ఆశ్చర్యం, రవ్వంత కోపంతో

 

అన్నాడు ఆ అమెరికన్ టూరిస్ట్.

 

" ఔనండీ...కొబ్బరిబొండాలు ఎక్కువగానే దొరుకుతాయి. కాని అమెరికన్ టూరిస్టులు

 

ఎప్పుడోకాని దొరకరు కదా " అని చెప్పి పకపక నవ్వాడు ఆ షాపు అతను.

 

అయోమయంగా చూస్తుండిపోయాడు ఆ అమెరికన్ టూరిస్ట్.