మార్చ్ 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వేడుకల్లో ఇదెంతో విశిష్టమైంది, ముఖ్యమైంది. చిన్నాపెద్దా అన్ని దేశాలూ ఆనందంగా జరుపుకునే రోజు.ఇంటాబయటా మహిళలను ఆదరించి, గౌరవించే రోజు.
అసలు అంతర్జాతీయ మహిళా దినోత్స్సవం ఎలా ఏర్పాటయిందో తెలుసుకోవాలంటే చరిత్ర పుటలు తిరగేయాలి. 19వ శతాబ్దంలో పారిశ్రామికీకరణవల్ల ఆర్ధికాభివృద్ధి మెరుగయిన మాట నిజం. అయితే దానితోబాటు పనిభారం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా స్త్రీలు ఇంటాబయటా చాకిరీ పెరిగి అలసిపోయారు, ఆందోళన చెందారు. ఆఫీసుల్లో పనిగంటలు ఎక్కువ, సెలవదినాలు ఉండేవి కావు. దాంతో విసిగిపోయిన కార్మికుల్లో సహజంగానే విప్లవం చెలరేగింది. పనిగంటలు తగ్గించాలని, వారానికోరోజు సెలవు ఇవ్వాలని పోరాటం చేశారు. ఈ నేపథ్యంలోంచే విమెన్స్ డే ఆవిర్భవించింది. అందుకే దీన్ని ఇంటర్నేషనల్ వర్కింగ్ ఉమెన్స్ డే అని కూడా అంటారు.