Home » Articles » ఫాదర్స్‌ డే అలా మొదలైంది

 

 

ప్రతి సంత్సరం జూన్ నెలల్లో మూడో ఆదివారం నాడు ఫాదర్స్‌ డే ని సెలబ్రేట్ చేస్తుంటాం. 1909లో మదర్స్‌డే అనే మాట స్మార్ట్‌ కుటుంబంలో తండ్రి పోషించిన పాత్ర ‘ఫాదర్స్‌’ డేకి పునాది అయ్యింది. 'హెన్రీ జాక్సన్‌ స్మార్ట్'‌, 'విలియమ్‌ స్మార్ట్‌' దంపతులు స్పోకనే గ్రామంలో వుండేవారు. వారికి ఆరుగురు సంతానం. వారిలో చివరి సంతానం ‘సొనారా’, ఆమె ఆరు నెలల వయసులో తల్లి మరణించింది. అప్పుడు ఆమె తండ్రి మరో పెళ్ళి చేసుకోకుండా, వ్యవసాయం చేస్తూనే ఆరుగురు బిడ్డలకీ తల్లి లేని లోటు తెలీకుండా పెంచాడు. తన చివరి కూతురు ‘సొనారా'కి తల్లి పాత్ర ఎలా వుంటుందనేది కూడ తెలియకుండా పెంచాడు.  ఆమెకి తెల్సింది తనని కంటికి రెప్పలా కాపాడిన తండ్రి.. ఊహ తెల్సింది మొదలు కళ్ళ ముందు తండ్రి. దైవంలా తనను కాపాడిన ఆ తండ్రి రుణాన్ని తీర్చుకోవటం కోసం బాగా ఆలోచించింది.. అందులోంచి పుట్టిందే ఈ ‘ఫాదర్స్‌ డే’.

 

తన తండ్రి పుట్టినరోజును మాములుగా కాకుండా..తండ్రులందరి జన్మదినంగా జరపాలని ఆమె అనుకుంది. కానీ ఆయన పుట్టిన తేదీ తెలీదు కానీ జూన్‌ నెలలో పుట్టినట్లుగా తెల్సు. అందుకే జూన్‌ నెలలో ఒక రోజు గ్రామంలోని వారందరినీ పిలిచి ఈ పుట్టిన రోజు కేవలం తన తండ్రిదే కాదని, అందరి తండ్రులందరిదీ అని తండ్రులు నిర్వహిస్తున్న పాత్రను మొత్తం సమాజం తెలుసుకొనే రోజని, పిల్లలకి విలువలు తెలిపే రోజని, దీన్ని ‘ఫాదర్స్‌ డే’ గా జరుపుకుందాం అని ప్రకటించింది 'సొనారా'. పైగా మదర్స్‌డే వున్నపుడు ఫాదర్స్‌ డే కూడా ఎందుకు నిర్వహించరాదని సొనారా ప్రశ్నించింది. అంతా నవ్వుకున్న కూడా ఆమె ‘ఆ ఫాదర్స్‌ డే’ గుర్తింపు కోసం నిజాయితీగా తీవ్రంగా ప్రచారం ప్రయత్నించింది.

 

1910 జూన్‌ 19న తొలిసారిగా ఈ దినాన్ని నిర్వహించారు. ఆరంభంలో దీనికి అంతగా స్పందన రాలేదు. కాని రాను రాను అదరణ పెరిగింది.1930 ప్రాంతంలో తిరిగి దీన్ని నిర్వహించడం ప్రారంభించారు. టైలు, టొబాకో పైపులు, ఇతర సంప్రదాయ బహుమతి వస్తువులను తయారు చేసే సంస్థలు ఈ భావనను ప్రోత్సహించాయి. 1938 నుంచి దీన్ని భారీస్థాయిలో వాణిజ్యపరంగా ప్రమోషన్‌ చేయడం మొదలైంది.

 

1980 నాటికి ఫాదర్స్‌ డే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.ఎన్నో దేశాల్లో దీన్ని పాటించడం మొదలుపెట్టారు. 1966లో అమెరికాలో దీన్ని అధికారికంగా గుర్తించారు. అయినా నాన్న ప్రేమకి కృతజ్ఞతలు తెలిపే ఈ అవకాశాన్ని ఎవరైనా ఎలా వదులుకుంటారు.

 
నాన్నలందరికి ప్రత్యేకమైన ఈ రోజున శుభాకాంక్షలు అందిస్తోంది తెలుగువన్.కాం