Home » Articles » నాన్న

 



ఓ వులేన్ ప్యాంటు

 
ఓ టెర్లిన్ షర్టు

 కోరమీసం

 చలువకళ్ళద్దాలతో నాన్న.

అమ్మకి పూలు

 తాతకి మందులు

 నాకు బిస్కెట్లు

 చెల్లికి చాక్లెట్లతో నాన్న.

అమ్మ రోగానికి

 నా చదువుకి

చెల్లి పెళ్ళికి

 అప్పులతో నాన్న.

ఓ వాలుకుర్చీ

 ఓ కళ్ళజోడు

 ఓ న్యూస్ పేపరు

 పక్కనో టీ కప్పుతో నాన్న

 దుమ్ముపట్టిన ఫ్రేములో

 వాడిన పూలదండలతో

 మా నిర్లక్ష్యానికి సాక్ష్యంగా

 నవ్వుతూ అమ్మ పక్కన నాన్న. ...

 

 

@ శ్రీ (FATHERS DAY సందర్భంగా )...