దేవీ నవరాత్రులు ... స్పెషల్ స్టోరీ - 2
అమ్మల గన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపెద్దమ్మ
సురారులమ్మ కడుపారడి పుచ్చిన య్మ తన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి యమ్మ దుర్గమా
యమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్త పటుత్వ సంపదల్.
శక్తి అవతారాలు ` మహాసరస్వతి
మరొక్కప్పుడు శుంభ నిశుంభులపై దానవ సోదరులు పాతాళం నుండి భూలోకం వచ్చి పుష్కర తీర్థంలో నీరైనా ముట్టక ఒకే అసనంలో ఉండి వేల ఏండ్లు తపస్సు చేశారు. బ్రహ్మచారి తపసుకి మెచ్చి, ప్రత్యక్షమై వరం కోరుకోమంటే రాక్షసులందరూ కోరే వరమే కోరారు ` తమకు అమరత్వం ప్రసాదించమని. బ్రహ్మ అది తన చేతులల లేదని, ఇంకేదైనా వరం కోరుకోమని అన్నాడు వారు తమకు అమర, నర, పశు పక్షి పురుషుల వల్ల చావులేని వరం ఇమ్మని కోరారు. అంతటితో ఆగలేదు. స్ల్రీఉ బలహీనులు కనుక మాకు వారి పట్ల బయం లేదు అని చెప్పారు బ్రహ్మ తథాస్తు అన్నాడు. వారు శుక్రుని తమ పురోహితునిగా చేసుకొన్నారు. శుక్రుడు శుంభుని దానవ రాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాడు శుంభుడు రాజ్య పాలన చేయటం ప్రారంభించాడు. చండముండులు, ధూమ్రలోచనుడు, రక్త భీజుడు మొదలైన దానవులందరు వారిని కొలువ సాగారు. వారు మహా బలవంతులై వరగర్వంతో తమని ఎదిరించే వారెవరూ లేరనే అహంకారంతో భూమిపై ఉన్న రాజులందరను గెలిచారు. స్వర్గంపై దాడి చేసి, ఇంద్రుని ఆసనాన్ని అధిరోహించి, త్త్రెలోక్యాధిపత్యాన్ని యాగభగాలని, కూడా హరించాడు. దిక్పాలకులను సూర్య చంద్రాది దేవతలను గెలిచి, వారి పదవులను కూడా గ్రహించాడు. వారి పనులు కూడా తానే చేయటం మొదలు పెట్టాడు.
దేవతలు నిరాశ్రయులై మిక్కిలి బాధపడి, బృహస్పతి సూచన ననుసరించి మిమవత్సర్యతము మీద ఉన్న దేవిని శరణు వేడటానికి బయలేదేరారు. ఆ జగదంబ వారికి అవసరమైనప్పుడు తలుచుకోగానే ప్రత్యక్షమై సహాయం చేస్తానని వరం ఇచ్చి ఉన్నది కదా!
హిమగిరులకు వెళ్ళి, అక్కడ మాయా బీజాన్ని మనస్సులలో నలిపి, భక్తితో ధ్యానం చేశారు. అనేక విధాలుగా కీర్తించారు. వారి స్తుతులకు సంతృప్తి చెందినదై పార్వతి గిరిగుహ నుడి వెలుపలికి వచ్చి వారికి అభయం ఇచ్చింది. పార్వతి శరీరం నుండి ఒక శుభ సుందర రూపం వెలువడిరది. పార్వతి శరీర కోశం నుండి వెలువడటం చేత ఆమె కౌశికిగా ప్రఖ్యాతి పొందింది. కౌశికి వెలువడిన తరువాత పార్వతి కృష్ణ వర్ణంతో భయంకర రూపాన్ని ధరించింది. దానవులకు భయాన్ని, భక్తులకు అభయాన్ని ప్రసాదించే కాళిక. కాళి. కాళరాత్రి అని పేరుపొందింది. అంబిక సింహవాహనమై, కాళికతో కలిసి దానవ సంహారానికి ఉద్యుక్తురాలవటంతో దేవతలందరు సంతోషించారు. పార్వతి కృష్ణ వర్ణంతో భయంకర రూపాన్ని ధరించి, దానవులకు భయాన్ని, భక్తులకు అభయాన్ని ప్రసాదించే కాళిక, కాళి, కాళరాత్రి అని పేరుపొందింది. అంబిక సింహవాహనంపైన, కాళికతో కలిసి దానవ సంహారానికి ఉద్యుక్తురాలవటంతో దేవతలందరు సంతోషించారు.
అంబిక ఒక ఉద్యానవనం చేరి, విలాసంగా మధుర గానం చేయసాగింది. అది దానవులు బాగా తిరిగే చోటు. చండ ముండులనే శుంభుని సేవకులు దేవి సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపడి, ఆ సుందర గురించి శుంభునికి తెలిపారు. శుంభుని వద్ద నన్ను అన్ని శ్రేష్ట వస్తువులకన్న గొప్పది అయిన ఆ అపురూప సౌందర్య రాశిని స్వతం చేసుకోక పోతే శుంభుని ప్రాభవం వ్యర్తం అని రెచ్చగొట్టారు శుంభుడు సుగ్రీవుడనే మంత్రిని అంబిక కడకు మధ్యవర్తిగా పంపాడు. శుంభుడు అదేశించిన రీతిగా సుగ్రీవుడు తియ్యని మాటలతో అంబికకు శుంభుని గనతను చెప్పి, అతడు ఆమెపై మరులుకొన్న విషయాన్ని, అతడిని చేరితే ఆమె పొందే సుఖాలని, వైభవాలని ఏకరవు చెప్పాడు. అంబిక తనకు శుంభ నిశుంభుల గొప్పతనం గురించి తెలుసునని, అతడిని పతిగా పొందాలనే వెతుక్కుంటూ వచ్చానని, కాని ఒక చిన్న ఇబ్బంది ఉన్నదని, చిన్నతనంలో స్నేహితులతో ఆడుకుంటూ బాల్య దాపత్యంతో తనను యుద్ధంలో గెలిచిన వారినే వివాహ మాడుతానని ప్రతిజ్ఞ చేశానని, అయితే తను అబలని కనుక తనని గెలవటం కష్టం కాదు కనుక తనని యుద్ధంలో గెలిచి చేపట్టమని యుద్ధానికి సోదరులలో ఎవరైనా రావచ్చునని తన సందేశంగా చెప్పమంది.
సుగ్రీవుడు యుద్ధం ఆమె వంటి సుకుమారికి తగదని నచ్చచెప్పబోయాడు. కాని దేవి తను ఆడిన మాటని తప్పజాలనని, తనని గెలిచి చేపట్టమని, యుద్ధం కోరియే తను వచ్చినట్టు శుంభునికి చెప్పవలసిందిగా సుగ్రీవునితో చెప్పి పంపింది. సుగ్రీవుని మాటలను విన్న శుంభుడు నిశుంభుని సూచన మేరకు ఆమెను తెమ్మని ధూమ్రలోచనుడిని పంపాడు. అతడామను మంచి మాటలతో ఒప్పించటానికి ప్రయత్నించాడు. ధూమ్రలోచననుని మాటలను విన్న కాళికాదేవి తనతో యుద్ధము చేయమని అతడిని సంహరించింది. ఆమె చేసిన శంఖనాదం శుంభుడు విని కారణం తెలుసుకొని, ఆమెపైకి యుద్ధానికి వెళ్లదలచిన నిశుంభుని వారించి ఆమెను పట్టి తెమ్మని వీలుకానిచో చంపి అయినా ఆమె మదమణచమని, చండ ముండులని పంపాడు.
వారు అంబికను సమీపించి ముందుగా సామోపాయము ప్రయోగింప దలచి, మంచి మాటలతో ఆమె మనసు శుంభునిపై మరలునట్లు చేయటానికి ప్రయత్నించారు కాని అంబిక వారిని రెచ్చగొట్టేట్టు మాట్లాడిరది. వారు కోపంతో యుద్ధానికి పూపుకున్నారు. దేవి కోపంతో బొమ ముడివేయగా నుదుటి నుండి శ్రీ కాళిక ఉద్భవించింది. పరమ భయంకర రూపంతో ఘోరంగా కనపడుతున్న కాళిక దానవ సైన్యాన్ని, ఏనుగలను, గుర్రాలను, ఒంటెలను సమలుతూ మింగుతూ చండ ముండుల నిద్దరను పడగొట్టి, వారిని కుందేలు పిల్లల లాగా చేతిలో పట్టుకుని అంబికకు సమర్పించింది. అంబిక వారిని సంహరించమని చెప్పగానే వారిని ఖడ్డానికి వారిని చేసివారి రక్తం త్రాగింది కాళిక. సంతసించిన అంబిక చండ ముండులను సంహరించినందుకు కాళికను చాముండి అనే పేరుతో భూలోకంలో ప్రసిద్ధమవుతావు అని కీర్తించింది. పారిపోయి తిరిగి వచ్చిన సైన్యం శుంభునికి దేవి పరాక్రమాన్ని గురించి తెలిపి, భయపెట్టారు. శుంభుడు రక్తబీజుని దేవిపై యుద్దానికి పంపాడు ముందుగా దేవికి శుంభుని వరించమని బోధించాడు. అతడి మాటలకు అంబిక, దాముండ ఇద్దరూ నవ్వుకున్నారు. అంబిక అతడితో యుద్దం చెయ్యి, లేదంటే పాతాళానికి వెళ్ళండి నీవూ, నీ రాజు అని రెచ్చ గొడుతూ మాట్లాడిరది. రక్తబీజుడు, అతడి సైన్యము యుద్దం చేయసాగారు. ఆ సమయంలో సర్వదేవతలు తమతమ శక్తులను జగదంబకు తోడుగా పంపారు. అవన్నీ ఆయా దేవతలకు చెందిన ఆభరణాలను, ఆయుధాలను ధరించి, వాహనాలను అధిరోహించి వచ్చి రర్తబీజుని సైన్యాన్ని మట్టుపెట్టసాగాయి.
ఆ సమయంలో శివుడు దేవతలనందరను తన వెంట తీసుకొని, యుద్ధ భూమికి వచ్చాడు. వెంటనే శుంబ నిశుంభులను, రక్త బీజుని పరిమార్చమని చెప్పాడు. దేవి సంతోషించింది. అపుడు చండిక శరీరం నుండి అద్భుత దివ్వ శక్తి ఆవిర్భవించింది. ఘోర రూపంలో ఉన్న ఆమె శివునితో శుంభ నిశుంభుల వద్దకు దూతగా వెళ్లి, వారిని తిరిగి పాతాళానికి వెళ్ళమని చెప్పమని కోరింది శివుడామె చెప్పినట్టు చేశాడు శివుని దూతగా చేసుకున్నది గనుక ఆమె శివదూతిగా ప్రసిద్ధి వహించింది.
మాతృకా గణ యుద్దం
దేవతలు పంపిన వారి వారి శక్తులు దానవ సైన్యాలని సర్వ నాశనం చేయసాగాయి. ఈ శక్తులను మాతృకాగణాలు అంటారు.
1. బ్రహ్మ యొక్క శక్తి బ్రహ్మాణి హంస వాహనారూఢjైు శ్వేత వస్త్రాభరణాలు ధరించి అక్షమాల, కమండలువు ధరించి వచ్చింది. కమండలువులో ఉన్న మంత్రి జలం చల్లి దానవుల ప్రాణాలు హరించ సాగింది.
2. విష్ణువు శక్తి వైష్టవి అనే పేరుతో గరుడ వాహనాన్ని అధిరోహించి పీతాంబరదారిjైు. శంఖ చక్ర గదా పద్మాలను ధరించి, వచ్చింది. తన గదాచక్ర ప్రహారాలతో రక్కసుల కుత్తుక లుత్తరించసాగింది.
3. శివుని శక్తి మాహేశ్వరి, లేక శాంకరి అని పిలువ బడుతూ, వృషభ వాహనాన్ని ఎక్కి, త్రిశూలాన్ని చేతపట్టి, నుదుట చంద్రరేఖ ప్రకాశిస్తూ ఉండగా, చేతులకు సర్పాభరణాలను ధరించి, వచ్చింది. త్రిశూలంలో దానవులను చీల్చి చెండాడిరది.
4. కుమారస్వామి శక్తి అయిన షష్టీ దేవికామారిగా శక్తి ఆయుధాన్ని ధరించి నెమలి వాహనాన్ని అధిరోహించింది వింటి నారిని చెవుల వరకు లాగి, వాడిఐన బాణాలతో దానవుల ప్రాణాలను తీయ సాగింది.
5. ఇంద్రుని శక్తి ఇంద్రి, మహస్త్రంద్రి, ఇంద్రాణి అనే పేర్లతో కీర్తించ బడుతూ, ఐరావతాన్ని అధిరోహించి, వజ్రాయుధాన్ని చేత ధరించి, మిక్కిలి కోపంతో రణరంగంలో దూకి, వజ్రాయుధ ఘాతాలతో దానవులని చంప సాగింది.
6. ఆదివరాహమూర్తి శక్తి అయిన వారాహీ దేవి వరాహ రూపాన్ని ధరించి కోపాతిరేకంతో, గట్టి ముట్టెతో వాడి కోరలతో ఎంతో మంది దానవులను పడగొట్టి చంపుతోంది.
7. సీసింహుని శక్తి నరసింహ రూపంతో నారసింహీ అనే నామంతో వచ్చి, వాడి అయిన గోళ్ళతో దానవులను చీల్చి, తింటూ, మధ్య మధ్యలో సింహనాదం చేస్తోంది.
ఈ మాతృకా గణంతో పాటుగా వరుణుని శక్తి వారుణీదేవి శత్రువులని పాశంతో బందించి, మూర్చితులను చేసి, ప్రాణాలను తీస్తోంది యముని రూపంతో యముని శక్తి యామ్యాదేవి మహిషము నెక్కి, దండాన్ని ధరించి, భయం గొలిపే విదంగా రణభూమిలో అడుగు పెట్టి, దానవులని యమ సదనానికి పంపుతోంది. వీరికి తోడు శివదూత కూడా దానవులను విజృంభించి నేల కూలనేస్తూ ఉంటే దాముండా, కాళికలు వారిని తినేస్తున్నారు. దానవులు భయపడి పారిపోతుంటే రక్త బీజుని కోపం మిన్నుముట్టి, దేవితో యుద్ధానికి వచ్చాడు. మాతృకాగణాలు అతడిపై ఆయుధాలను వేయగానే వాడి శరీరం నుండి కారిన ప్రతి రక్త బిందువు నుండి ఒక్కొక్క రక్త బీజుడు పుట్టి వారి సంఖ్య అసంఖ్యాకం అయింది దేవతలందరు భయభ్రాంతులై పోయారు. అప్పుడు అంబిక కాళికను నోరు పెద్దది చేసి, రక్త బీజుడి నుండి కారుతున్న రక్తాన్నంతా తాగి వేయమని చెప్పింది. వాడి శరీరం నుండి కారుతున్న రక్తాన్ని, క్రింద పడకుండా తాగటంతో వాడు నీరసించాడు. వాడి శరీరాన్ని శ్రీదేవి ముక్కలు చేస్తుంటే కాళిక తినేసింది. వాడి నెత్తురులో నుండి పుట్టిన మిగిలిన రక్త బీజులని శ్రీదేవి చంపి ముక్కలు చేస్తుంటే కాళి భక్షించింది. అంబిక వాహనమైన సింహం కూడా ఎంతో మంది దానవులని తినేసింది.
చావక తప్పించుకు పారిపోయిన వారు శుంభునికి జరిగిన దంతా చెప్పి అటువంటి వీర వనితతో యుద్ధం శ్రేయస్కరం కాదు అని విన్నవిస్తారు. మృత్యువు తరుముతున్న వారికి హితవైన మాట వినబుద్ధి అవదు కదా! తానే ఆమెపై యుద్దానికి సిద్ధం అవుతాడు నిశుంభుడు అన్నని వారించి తానే శ్రీదేవితో యుద్దానికి బయల్దేరాడు వారి యుద్దాన్ని శుంభుడు దేవతలు కూడా చూస్తున్నారు కుతూహలంతో. ముందుగా నిశుంభుడి తల తెగ నరికింది దేవి. అయినా అతడి మొండెం కత్తి పట్టుకొని తిరుగుతుంటే ఆ మొండెం కాళ్ళు చేతులు నరికింది దేవి. దానితో నిశుంభుడు అసువులు బాశాడు. తప్పించుకొని పారిపోయి బ్రతికిన దానవులు శుంభునికి దేవితో యుద్ధం ప్రాణాంతకం అని చెప్పారు. శుంభుడు పెడ చెవిన పెట్టాడు ఆమె రూపం చూసి, యుద్ధం మాట మరచి వ్యామోహంలో పడిపోయాడు. ఆమెను తనను చేపట్టమని ప్రార్థించాడు. శ్రీదేవి అతడిని తనతో యుద్ధం చేయలేకపోతే చండికతో గాని, కాళికతో గాని యుద్ధం చెయ్యమంది. అతడు పౌరుషం పెరిగి, శ్రీదేవితోనే యుద్ధం చేయదలచాడు. ఘోర యుద్ధం తరువాత శ్రీదేవి శుంభుని పరిమార్చింది. దేవతలకు తిరిగి స్వర్గ రాజ్యం లభించింది. మాట నైపుణ్యంతో యుద్ధానికి ఆహ్వానించి గెలిచిన జగన్మాత అవతారాన్ని మహా సరస్వతిగా చెప్పటం జరిగింది.