Home » Vegetarian » Saggu Biyyam Semiya & Rajma Masala


సగ్గుబియ్యం సేమ్యా

 

తయారు చేసే విధానం: గిన్నెలో నెయ్యి వేసి కాగనివ్వాలి. ఆ తర్వాత అందులో సేమ్యా వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి, ఆ తరవాత అదే గిన్నెలో సగ్గు బియ్యం వేసి ఫ్రై చేసుకొని అందులో పాలు పోసి కాసేపటి వరకు మరగనిచ్చి ఆ తరవాత అందులో చెక్కెర వేయాలి, అది కరిగేలోపు ఇంకో గిన్నెలో జీడి పప్పు, ఎండు ద్రాక్ష ఫ్రై చేసుకోవాలి. ఆ తరవాత మరిగిన పాలలో ఫ్రై చేసుకున్న సేమ్యా, వేసి కాసేపు ఉడికాక బాదం పప్పు, ఎండు ద్రాక్ష వేసి సర్వ్ చేసుకోవాలి.

 

రాజ్మా మసాల

 

తయారు చేసే విధానం : ముందుగా, బంగాళా దుంపలు, రాజ్మా కలిపి ఉడకబెట్టుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక గిన్నెలో నూనె పోసి, అది కాగాక చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకొని టమాటాలు వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఆ తరవాత అందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, రాజ్మా , స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళా దుంప, కారం వేసి కలిపి కాసేపు మగ్గనిచ్చి, అందులో ఆంచూర్ పౌడర్, ఉప్పువేసి కాసేపు ఉడకనిచ్చి, చివరలో చాట్ మసాల వేసి దించేసి కొత్తిమీర తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.


Related Recipes

Vegetarian

కడాయి పన్నీర్ మసాలా

Vegetarian

బీన్స్ ఫ్రై

Vegetarian

సాబుదాన టిక్కీ

Vegetarian

పెరుగు బెండకాయ మసాలా కర్రీ

Vegetarian

మస్త్ మస్త్ మలై పన్నీర్ కర్రీ

Vegetarian

పాలక్ పరోటా

Vegetarian

Kaju Mushroom Masala Recipe

Vegetarian

Aloo Vankaya Curry