Home » Vegetarian » Pesara Pappu Bendakaya Pulusu


 

 

 పెసరపప్పు బెండకాయ పులుసు

 

 

 

కావలసినవి:

పెసరపప్పు- పావుకేజీ

బెండకాయలు – ఎనిమిది

చింతపండు గుజ్జు – చిన్న కప్పు
ఉప్పు, కారం – తగినంత  
ధనియాల – ఒక స్పూన్
జీలకర్ర – ఒక  స్పూన్
టమాట – ఒకటి
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిపకాయలు - రెండు
నూనె – రెండు స్పూన్లు 
నెయ్యి – ఒక స్పూన్
ఆవాలు – కొద్దిగా 
ఇంగువా – చిటికెడు
కరివేపాకు – రెండు రెబ్బలు
ఎండు మిర్చి – రెండు
మెంతి పోడి – చిటికెడు
కొత్తిమీర - కొద్దిగా 

 

తయారుచేసే విధానం:
పెసరపప్పును శుభ్రంగా కడిగి నాలుగు విజిల్స్ వచ్చెవరకు కూక్కల్లో పెట్టుకోవాలి. ఉల్లిపాయ, టమాటా, బెండకాయ మరియు పచ్చిమిరపకాలను తరిగి ప్రక్కన పెట్టుకోవాలి. బాణలిని పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వేసి కలిపి ఒక్క నిమషం మూతపెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరవాత టమాటా ముక్కలు, పసుపు, ఉప్పు వేసి మరో రెండు నిమషాలు మూత పెట్టుకోవాలి. టమాట బాగా మగ్గిన తరవాత బెండకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. కుక్కర్ చల్లారిన తరవాత  ఉడికిన పెసరపప్పును తీసి బాగా మెదిపి, వుడుకుతున్న బెండకాయలో వేసి నాలుగువైపుల కలిపి, చింతపండు గుజ్జు వేసి, రెండు గ్లాసుల నీళ్ళు పోసి మరగపెట్టాలి. తరువాత కారం, ధనియాల, జీలకర్ర, కరివేపాకు వేసి ప్రక్కన పెట్టుకోవాలి. మరో బాణలిని పోయి మీద పెట్టి, నెయ్యి వేసి ఇంగువా, మెంతి పొడి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి, పెసరపప్పు బెండకాయ పులుసులో కలుపుకోవాలి.  చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే! ఎంతో రుచిగా వుండే పెసరపప్పు బెండకాయ పులుసు రెడీ!

 


Related Recipes

Vegetarian

పెరుగు బెండకాయ మసాలా కర్రీ

Vegetarian

మస్త్ మస్త్ మలై పన్నీర్ కర్రీ

Vegetarian

సొరకాయ పప్పు

Vegetarian

పాలక్ పరోటా

Vegetarian

Kaju Mushroom Masala Recipe

Vegetarian

Aloo Vankaya Curry

Vegetarian

Bendakaya Pulusu

Vegetarian

Vankaya Pachi Pulusu