Home » Vegetarian » Palak Pakoda Recipe


 

 

పాలక్ పకోడీ 

 

 

 

కావలసినవి:
పాలకూర - ఐదు కట్టలు 
శనగపిండి - మూడు కప్పులు 
కారం - ఒక స్పూను 
వంట సోడా - చిటికెడు
పసుపు - కొద్దిగా  
ఉల్లిపాయలు - నాలుగు 
పచ్చిమిర్చి - మూడు
ఉప్పు, నూనె - తగినంత 

 

తయారుచేసే విధానం:
1. ముందుగా పాలకూర కాడలను వలిచి ఆ తరువాత కట్టలను విడదీసి నీళ్ళలో బాగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. 
2.ఇప్పుడు శనగపిండిని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలో జల్లించి దానికి తగినంత ఉప్పు, కారం, పసుపు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వంట సోడా కలపాలి.
3. ఈ మిశ్రమాన్ని నీళ్ళతో బజ్జీల పిండిలా కలపాలి.
4. ఆ తరువాత తరిగి వుంచిన పాలకూరను కూడా అందులో వేసి కలుపుకోవాలి.
5. ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్‌లో నూనె పోసి కాగాక అందులో పాలకూర మిశ్రమాన్ని చేతితో నలుపుతూ వేసి ఎర్రగా వేయించుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన పాలక్ పకోడీ రెడీ.

 

 


Related Recipes

Vegetarian

పాలక్ పనీర్

Vegetarian

పాలక్ పరోటా

Vegetarian

Kaju Mushroom Masala Recipe

Vegetarian

Palak Paneer

Vegetarian

క్రీమ్ పొటాటో సలాడ్!

Vegetarian

Colourfull Vegetable Salad (Holi Special)

Vegetarian

Bottle Gourd Sweet Curry with Milk

Vegetarian

Moong Dal Kosambari