Home » Non-Vegetarian » Fish Fingers


ఫిష్ ఫింగర్స్

 

 

కావలసిన పదార్థాలు:

చేపముక్కలు - 4

మైదా - 3 స్పూన్స్

మిరియాల పొడి - అర స్పూన్

వెనిగర్ - 2 స్పూన్స్

కారం - 1 స్పూన్

పసుపు - చిటికెడు

ఉప్పు - తగినంత

కోడిగుడ్డు - 1

బ్రెడ్ పొడి - అరకప్పు

నూనె - వేయించడానికి సరిపడా

 

తయారీ విధానం:

కోడిగుడ్డు సొనను బాగా గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి. చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి ముళ్లు తీసేయాలి. తరువాత వాటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి.

 

అయితే మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చాబచ్చాగా ఉంచుకోవాలి. దీన్ని ఓ బౌల్ లో తీసుకుని వెనిగర్ వేసి కలపాలి.

 

తరువాత మైదా, మిరియాల పొడి, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని, ఫొటోలో చూపిన మాదిరిగా ఒత్తుకోవాలి.

 

వీటిని కోడిగుడ్డు సొనలో ముంచి తీసి, బ్రెడ్ పొడిలో దొర్లించి, నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి... రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటాయి.

- Sameera

 


Related Recipes

Non-Vegetarian

బ్రోకలీ 65 రెసిపి

Non-Vegetarian

Grilled Fish with Saute Spinach

Non-Vegetarian

Chicken Nuggets

Non-Vegetarian

Chicken Dum Biryani (Ramzan Special)

Non-Vegetarian

Chicken Haleem (Ramzan Special)

Non-Vegetarian

Perfect Royyala Biryani

Non-Vegetarian

Chicken 65

Non-Vegetarian

Ginger Chicken