Home » Vegetarian » క్యాలీఫ్లవర్ రోస్ట్


క్యాలీఫ్లవర్ రోస్ట్

ముక్కలుగా కట్ చేసిన క్యాలీఫ్లవర్ - చిన్నది ఒకటి

నూనె - 1 టేబుల్ స్పూన్

పసుపు - అర టీస్పూన్

ఉప్పు - 1 టీస్పూన్

మిరియాల పొడి - అర టీస్పూన్

కరివేపాకు - 2రెమ్మలు

దాల్చిన చెక్క - తగినంత

లవంగాలు - 4

యాలకులు - 2

జీలకర్ర - అర టీ స్పూన్

ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు

పచ్చిమిర్చి - 4

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్

టమాట - పెద్దది ఒకటి

కారం - ఒకటిన్నర టీస్పూన్

ధనియాల పొడి- 1టీస్పూన్

జీలకర్ర పొడి - పావు టీ స్పూన్

గరం మసాలా - అర టీ స్పూన్

కొత్తిమీర - కొద్దిగా

జీడిపప్పు పలుకులు - కొద్దిగా

తయారీ విధానం:

క్యాలీఫ్లవర్ ముక్కలను వేడినీటిలో వేసి ఐదు నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత ఒక బాణాలిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక క్యాలీఫ్లవర్ ముక్కలను వడకట్టి నూనెలో వేయాలి. ఇందులో పసుపు,ఉప్పు వేసి కలపాలి. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను మధ్య మధ్యలో కలపుతుండాలి. ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి కలిగి గిన్నెలోకి తీసుకుని..అదే బాణాలిలో మరో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తర్వాత మసాలా దినుసులు జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి.

ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించుకోవాలి. తర్వాత టమాటాను ప్యూరీలాగా చేసి వేయాలి. ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించిన తర్వాత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకుని కలపాలి. తర్వాత వేయించిన క్యాలీఫ్లవర్ వేసి కలపాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత జీడిపప్పు, కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్ రోస్ట్ రెడీ. అన్నంతోకానీ సైడ్ డిష్ గా కానీ తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.


Related Recipes

Vegetarian

క్యాలీఫ్లవర్ రోస్ట్

Vegetarian

పొటాటో-కాలిఫ్లవర్ కబాబ్

Vegetarian

Cauliflower Tomato Palakura Curry

Vegetarian

Cauliflower Paratha

Vegetarian

Cauliflower Paneer Bhurji

Vegetarian

పన్నీర్ భుజియ

Vegetarian

Cauliflower Kurma

Vegetarian

Vankaya Menthi Kaaram