Home » Vegetarian » Cauliflower Kurma


 

 

క్యాలీఫ్లవర్‌ కుర్మా

 

 

 

కావలసినవి :
కాలీఫ్లవర్‌ - ఒకటి
టమాటగుజ్జు - అరకప్పు
జీడిపప్పు- కొన్ని
పచ్చిమిర్చి- 4
నూనె - సరిపడా
వెల్లుల్లి - 6 రెబ్బలు
మెంతులు -ఒక స్పూన్
పచ్చిబఠాణీలు - అర స్పూన్
ఉప్పు- తగినంత
కొత్తిమీర - ఒక కట్ట
ఉల్లిపాయ - ఒకటి
పసుపు - అర స్పూన్
అల్లం - చిన్నముక్క
కారం-ఒక స్పూన్
గసగసాలు - రెండు చెంచాలు
లవంగాలు -4
దాల్చినచెక్క- ఒక ముక్క
ఎండుకొబ్బరి తురుము - అర కప్పు

 

తయారుచేసే విధానం :
ముందుగా క్యాలిఫ్లవర్ ను కట్ చేసుకుని కడిగి పచ్చి బఠాణీలు రెండు ఉడికించుకోవాలి.  తరువాత  నానబెట్టిన జీడిపప్పు, గసగసాలు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, కొబ్బరితురుము, ఎండుమిర్చి , ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం, వెల్లుల్లి  మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి.  ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి మెంతులు, ఉల్లిపాయపేస్ట్  వేసి వేయించుకుని తరువాత  టమాట పేస్ట్, ఉప్పు, కారం వేసి కలిపి ఐదు నిముషాల తరువాత ఉడికించిన క్యాలీఫ్లవర్‌ బఠాణీలు వేసి వేగాక మసాలా పేస్ట్  వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించి  ఐదు నిముషాల తరువాత గ్రేవీ చిక్కబడ్డాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తమిరతో గార్నిష్ చేసుకోవాలి.

 

 


Related Recipes

Vegetarian

క్యాలీఫ్లవర్ రోస్ట్

Vegetarian

పెరుగు బెండకాయ మసాలా కర్రీ

Vegetarian

మస్త్ మస్త్ మలై పన్నీర్ కర్రీ

Vegetarian

పొటాటో-కాలిఫ్లవర్ కబాబ్

Vegetarian

పాలక్ పరోటా

Vegetarian

Kaju Mushroom Masala Recipe

Vegetarian

Aloo Vankaya Curry

Vegetarian

పన్నీర్ క్యాప్సికమ్ కర్రి