Home » Appetizers » బ్రెడ్ పకోడి


 బ్రెడ్ పకోడి!

 

కావాల్సిన పదార్థాలు:

బంగాళాదుంపలు - 2

బ్రెడ్ ముక్కలు -4

జీలకర్ర -1 టేబుల్ స్పూన్

ధనియాలు - 1టేబుల్ స్పూన్

క్యారమ్ విత్తనాలు -1 టేబుల్ స్పూన్

కొత్తిమీర తరుగు -2 టేబుల్ స్పూన్

శనగపిండి - 2 కప్పుల

యాలకుల పొడి - 2 స్పూన్లు

కాశ్మీరీ ఎర్ర మిరపపొడి -1/2 టీస్పూన్

తయారు విధానం:

-ముందుగా బాణలిలో జీలకర్ర, ధనియాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి.

-ఇప్పుడు బాణలిలో కొంచెం నూనె వేసి వేడయ్యాక.. మెత్తగా రుబ్బిన అల్లం, పచ్చిమిర్చి, ఉడికించిన బంగాళదుంపలతో సహా మసాలా దినుసులన్నీ వేసి బాగా కలపాలి.

-ఈ మిశ్రమంలో ఎర్ర మిరప పొడి, పుల్లటి క్రీమ్, ధనియాలు, జీలకర్ర పొడిని వేసి కలపాలి.

-ఈ మిశ్రమంలో ఉప్పు, కొత్తిమీర వేసి కలపాలి.ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి.

-మరో పాత్రలో శనగపిండి...కొద్దిగా ఉప్పు, కారం వేసి కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పిండిలా తయారు చేసుకోవాలి. పూర్తిగా కలిపిన తర్వాత 5-7 నిమిషాలు పక్కన పెట్టండి.

-బంగాళాదుంప మిశ్రమాన్ని ఒక బ్రెడ్ స్లైస్‌పై బాగా స్ప్రెడ్ చేసి.. మరో బ్రెడ్ స్లైస్‌ను కవర్ చేయాలి.

-మిశ్రమంతో నింపిన బ్రెడ్ స్లైస్‌ను శనగ పిండిలో ముంచండి. బాగా వేడెక్కిన నూనె పాన్‌లో వేయించాలి. పకోడాలను రెండు వైపులా బాగా వేయించి, బ్రౌన్‌ రంగులోకి మారిన తర్వాత నూనె నుంచి తీయాలి.

-అంతే సింపుల్. వేడి వేడి బ్రెడ్ పకోడి రెడీ. దీనిని సాస్, మయోనైస్ లేదా పుదీనా చట్నీతో తింటే భలే ఉంటుంది.


Related Recipes

Appetizers

బ్రెడ్ పకోడి

Appetizers

How To Make Crispy Pakoda

Appetizers

దహీ బ్రెడ్‌ వడ!

Appetizers

Bread Cutlet

Appetizers

Keema Bread Sandwich

Appetizers

Bread Chaat

Appetizers

Paneer Pakodi

Appetizers

Special Aloo Pakodi