Home » Vegetarian » Vegetable Medley Recipe
వెజిటబుల్ మెడ్లీ
కావలసినవి:
బంగాళదుంపలు - ఐదు
క్యారెట్ - ఐదు
పచ్చి బఠాన్ని- క కప్పు
ముల్లంగి - ఒకటి
ఉల్లిపాయలు - ఐదు
కొబ్బరి తురుము - ఒక కప్పు
ఉప్పు - తగినంత
వెనిగర్ - రెండు స్పూన్లు
పసుపు - చిటికెడు
అల్లం వెల్లుల్లి - కొద్దిగా
పచ్చిమిర్చి - ఎనిమిది
కరివేపాకు - రెండు రెబ్బలు
నిమ్మకాయ - ఒకటి
నూనె - తగినంత
తయారు చేసే విధానం:
ముందుగా కూరగాయలను శుభ్రంగా కడిగి, ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొబ్బరి తురుములో రెండు గ్లాసులు నీళ్ళు పోసి పాలు తీసుకొని పక్కన పెట్టండి. తరువాత ఒక గిన్నెలో నూనె పోసి వేడి చేసి, దానిలో అల్లం వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి ఎర్రగా వేయించాలి. అలాగే ముందుగా తరిగి పెట్టిన కూరగాయ ముక్కల్ని కలిపి, చిటికెడు పసుపు, ఒక గ్లాసు కొబ్బరి పాలు పోసి తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. నీరు ఇరిగిపోయిన తరువాత, మిగిలిన కొబ్బరి పాలు పోసి ఇంకా కొంచెంసేపు ఉడికించాలి. కూరను దించిన తరువాత వెనిగర్, నిమ్మరసం పిండాలి. అంతే వెజిటబుల్ మెడ్లీ రెడీ.