Home » Vegetarian » Vegetable Kofta
వెజిటబుల్ కోఫ్తా
కావలసినవి:
కంద - 1/4 కిలో
క్యాబేజీ - 1/4 కిలో
బంగాళదుంప - 100 గ్రా
అరటికాయలు - 2
ధనియాలు - 1 స్పూన్
అల్లం , వెల్లుల్లి ముద్ద - 4 స్పూన్
కారం - తగినంత
ఉప్పు - తగినంత
పసుపు - 1 స్పూన్
గసగసాలు - 1 స్పూన్
కొబ్బరి - చిన్నముక్కలు
లవంగాలు - 2 1/2 గ్రా "
ఉల్లిపాయలు - 4
నూనె - తగినంత
పచ్చిమిర్చి - తగినంత
తయారుచేసే విధానం :
కంద, బంగాళదుంప, అరటికాయ చెక్కుతీసి, క్యాబేజీ, అన్ని కలిపి ముక్కలు తరిగి ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. ధనియాలు, లవంగాలు, దాల్చినచెక్క ముద్ద నూరాలి. ఉడికించిన విజిటబుల్స్, అల్లం, వెల్లుల్లిముద్ద నూరిన మసాలాముద్ద, కారంవేసి తగినంత ఉప్పువేసి మెత్తగా చిన్నవుండలుగా చేసి వేయించాలి. గసగసాలు, కొబ్బరిముద్ద నూరాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు చేయాలి. బాణలిలో తగినంత నూనెవేసి మరిగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేయించి. గసగసాలు, కొబ్బరిముద్ద వేసి వేయించి నీరు పోసి ఉడికించి దగ్గరపడేముందు వేయించిన కోఫ్తాలనువేసి ఉండలు చితికిపోకుండా కలియబెట్టాలి. పైన కొత్తిమీరవేసి వడ్డించేముందు నిమ్మరసం వేసుకోవాలి.