Home » Sweets N Deserts » Sweet Carrot Crackers
స్వీట్ క్యారెట్ క్రాకర్స్
రోజూ ఒకే రకమైన వంట తిని విసుగుపుడుతోందా? అయితే ఖచ్చితంగా ఇది మీ కోసమే. అదిరిపోయే స్వీట్ క్యారెట్ క్రాకర్స్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు:
క్యారెట్ తురుము - ఒకటిన్నర కప్పు
చక్కెర - ముప్పావు కప్పు
మైదాపిండి - ఒక కప్పు
నీళ్లు - అరకప్పు
చీజ్ తురుము - అరకప్పు
కోడిగుడ్లు - రెండు
తయారీ విధానం:
క్యారెట్ తురుములో నీళ్లు వేసి స్టౌ మీద పెట్టాలి. క్యారెట్ బాగా ఉడికిన తరువాత నీటిని ఒంపేసి క్యారెట్ తురుముని ఆరబెట్టాలి.
చల్లారిన తరువాత క్యారెట్, కోడిగుడ్డు సొన, చీజ్, చక్కెర కలిపి మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
దీన్ని ఓ బౌల్ లోకి తీసుకుని, కొద్దికొద్దిగా మైదాపిండి వేసి కలుపుతూ ఉండాలి.
చపాతీ పిండిలా అయ్యేవరకూ బాగా కలుపుకుని పక్కన పెట్టేయాలి.
అరగంట తరువాత కొద్దికొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని, ఉండలు చేసుకుని, చపాతీల్లా ఒత్తాలి.
వీటిని నాలుగు వైపులా చాకుతో కోసేసి, ఆ తరువాత ఫొటోలో చూపిన విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి.
మైక్రో అవన్ ఉన్నవాళ్లు 350 డిగ్రీల వద్ద పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అవన్ లేకపోతే నూనెలో డీప్ ఫ్రై చేసుకోవచ్చు.
- Sameera