Home » Sweets N Deserts » Sooji Halwa
సూజీ హల్వా
కావలసిన పదార్ధాలు
సూజీ (ఉప్మా రవ్వ) - 1 కప్పు
క్లారిఫైడ్ బటర్ - 1/2 కప్పు
షుగర్ - 2 కప్స్
యాలుకల పొడి - తగినంత
వాటర్ - 2 కప్స్
నట్స్ ( జీడిపప్పు, బాదం) - 1/2 కప్పు
తయారుచేసే విధానం:
* ముందుగా స్టౌవ్ వెలిగించి కళాయి పెట్టి అది కొంచెం వేడెక్కిన తరువాత అందులో క్లారిఫైడ్ బటర్ వేసి కరిగించాలి.
* తరువాత అందులో సూజీ (ఉప్మా రవ్వ) వేసి.. చిన్న మంట మీద గోల్డన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేస్తూనే ఉండాలి.
* ఇప్పుడు చాప్ నట్స్ కూడా అందులో వేసి రవ్వ ఫ్రై అవుతుండగానే..మరో గిన్నె తీసుకొని అందులో వాటర్, పంచదార వేసి వేడి చేయాలి.
* తరువాత తరువాత వాటర్ లో యాలుకల పొడి కూడా కలపాలి. (కావాలనుకుంటే కుంకుమ పువ్వు కూడా కలుపుకోవచ్చు.)
* ఇప్పుడు రవ్వ బంగారు రంగులోకి వచ్చిన వెంటనే.. రవ్వలో షుగర్ వాటర్ ను చిన్నగా పోస్తూ కలుపుకోవాలి.
* తరువాత రవ్వను చిన్న మంట మీద ఒక నిమిషం లేదా ఒకటిన్నర నిమిషం పాటు ఉడికించాలి. అంతే మనకు కావలసిన సూజీ హల్వా రెడీ.