Home » Sweets N Deserts » Shiva ratri specials
శివరాత్రి స్పెషల్స్
క్యారెట్, బాదం బర్ఫీ
కావలసినవి :
బాదం పప్పు - 1 కప్పు
పంచదార - 2 కప్పులు
వెన్న - అర కప్పు
క్యారెట్ - 2
యాలకుల పొడి - అర టీ స్పూను.
తయారీ :
ముందుగా బాదం పప్పుని ఒక రాత్రంతా నానబెట్టాలి తరువాత రోజు పైన పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత క్యారెట్‌ని కడిగి కట్ చేసి ఉడికించాలి . ఇప్పుడు బాదం, క్యారెట్‌లని కొద్దిగా పాలు కలుపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెపెట్టి అందులో బాదం మిశ్రమం , పంచదార, వెన్న వేసి ఉడికించాలి. ఇలాచి పొడి చల్లి ప్లేట్ కి నెయ్యి రాసి క్యారెట్ బర్ఫీ ని వేసి చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలి.
*****
కార్న్‌ఫ్లోర్ బర్ఫీ
కావలసినవి :
కార్న్‌ఫ్లోర్ - 1 కప్పు
పాలు - పావు లీటర్
నెయ్యి - తగినంత
జీడిపప్పు - 10
పంచదార - ఒకటిన్నర కప్పు.
తయారీ : ముందుగా ఒక పాత్రలో పంచదార, కార్న్‌ఫ్లోర్ వేసి ఉండలు కట్టకుండా పాలు పోసి కలపాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్‌పెట్టి అందులో ఈ మిశ్రమం వేసి సన్నని మంటపై చిక్కబడేదాక గరిటెతో తిప్పుతుండాలి. తర్వాత ప్లేట్‌కి నెయ్యి రాసి సమానంగా పరిచి నేతిలో వేయించిన జీడిపప్పుని చిన్నగా కట్ చేసుకుని దీనిపై వేసుకుని కావాల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి....
*****
శనగపప్పు బర్ఫీ
కావలసినవి :
శనగపప్పు - అర కప్పు
పాలు - అరకప్పు
నూనె - 1 టేబుల్ స్పూను
వెన్న - 2 టేబుల్ స్పూన్లు
యాలకులపొడి - 1 టీ స్పూను
పంచదార - అరకప్పు
మిల్క్‌పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు
పిస్తా ముక్కలు - అరకప్పు
తయారీ :
ముందుగా నూనె కలిపిన నీటిలో శనగపప్పుని నైట్ అంతా నానబెట్టి, ఆ నీళ్లతోనే ఉడికించి మెత్తగా చేసుకోవాలి. తరువాత కడాయిలో స్పూను వెన్న వేసి నిమిషం తర్వాత పప్పు, పాలు, యాలకులపొడి వేసి కలిపి కలుపుతూ కొద్దిసేపు ఉడికించాలి. తర్వాత పంచదార, మిల్క్‌పౌడర్, పిస్తా ముక్కలు వేయాలి. పంచదార పూర్తిగా కరిగాక వెన్న రాసిన ప్లేట్‌లో ఈ మిశ్రమం వేసి తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి...