Home » Appetizers » ఓట్స్ పకోడి
ఓట్స్ పకోడి
కావాల్సిన పదార్థాలు:
సాధారణ ఓట్స్ -1 కప్పు
శనగపిండి - పావు కప్పు
బియ్యంపిండి - పావు కప్పు
ఉప్పు -రుచికి సరిపడినంత
పచ్చిమిర్చి - 2 చిన్నగా తరిగినవి
కరివేపాకు - 1 రెమ్మ
కొత్తిమీర - కొద్దిగా
పసుపు - పావు టీస్పూన్
కారం -1 టీస్పూన్
గరంమసాలా - అరటీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీస్పూన్
ఉల్లిపాయలు - పొడవుగా తరిగినవి
జీడిపప్పు పలుకులు- కొద్దిగా
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్లోకి ఓట్స్ తీసుకోవాలి. తర్వాత వాటిపై నీళ్లు చల్లుకుని కలుపుకోవాలి. ఓట్స్ తడిసిన తర్వాత వాటిపై మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాతర ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని పకోడీలా వేసుకోవాలి. వీటిని తక్కువ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ఫ్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేస్తే ఎంతో రుచిగా ఉండే ఓట్స్ పకోడి రెడీ అవుతుంది. ఈ విధంగా తయారు చేసిన ఈ పకోడీలు చాలా రుచికరంగా ఉంటాయి.