Home » Appetizers » మష్రూమ్ కబాబ్
మష్రూమ్ కబాబ్!
కావలసిన పదార్థాలు:
పుట్టగొడుగులు - 200 గ్రాములు
కబాబ్ పౌడర్ - 1 ప్యాకెట్
అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
కారంపొడి - అర చెంచా
చికెన్ మసాలా - అర చెంచా
గుడ్డు - ఒకటి
ఉప్పు - రుచి సరిపడా
నూనె - కొద్దిగా
తయారీ విధానం:
- మష్రూమ్ కబాబ్ తయారు చేసే ముందు... పుట్టగొడుగులను బాగా కడగాలి.
- తర్వాత కబాబ్ పౌడర్, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, చికెన్ మసాలా పొడి, గుడ్డు, నూనె, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి.
- ఈ పదార్థాలన్నీ మష్రూమ్ కు పట్టేందుకు.. 10 నుండి 15 నిమిషాల పాటు నాననివ్వండి.
- తర్వాత ఒక పాత్రలో నూనె వేసి మీడియం మంట మీద వేడి చేయాలి.
-అందులో నానబెట్టిన పుట్టగొడుగులను వేసుకోని బ్రౌన్ కలర్ లో వచ్చేంత వరకు వీటిని వేయించండి.
-అంతె ఇప్పుడు వేడి వేడి మష్రూమ్ కబాబ్ రెడీ. టమోటా కచప్ తో సర్వ్ చేసుకుంటే రుచి అదిరిపోతుంది.