Home » Vegetarian » Moong Dal Fry
మూంగ్ దాల్ ఫ్రై
కావలసిన పదార్థాలు:
ఉడికించిన పెసలు - 1 కప్పు
ఉప్పు - తగినంత
కారం - 1 స్పూన్
పసుపు - చిటికెడు
పచ్చిమిర్చి - 4
అల్లం ముక్కలు - 1 స్పూన్
వెల్లుల్లి ముక్కలు - 1 స్పూన్
ఉల్లి ముక్కలు - 1 కప్పు
టమాటా ముక్కలు - 1 కప్పు
జీలకర్ర - 1 స్పూన్
వెన్న - 2 స్పూన్స్
పాలక్రీము
కరివేపాకు
తయారీ విధానం:
తయారు చేయటానికి అరగంట ముందు పెసలని నానబెట్టుకోవాలి. నానిన పెసలని కుక్కరులో పెట్టి 3 విసల్స్ వచ్చాక ఆపాలి. తడకా కోసం ముందుగా వేడి చేసిన ప్యాన్ లో వెన్న వేసి, కరిగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగి ఉంచుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. అన్నీ వేగిన తరవాత టమాటా ముక్కలు వేసి 5 నిముషాలు మగ్గించాలి. అందులో తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ కారం వెయ్యాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన ఉంచుకున్న పెసలని కలపాలి. అందులో 1 కప్పు నీరు జోడించి 5 నిముషాలు సిమ్ములో ఉడికించాలి.పూర్తైన దాల్ ఫ్రై ని ఒక డిష్ లోకి తీసాక దానిపై గార్నిష్ కోసం స్ప్రింగ్ ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు వేయించి పోపు వేసుకోవాలి. దానిపై కవలసినవాళ్లు పాలక్రీముని వేసుకోవచ్చును. అంతే కలర్ ఫుల్ గా ఉండే మూంగ్ దాల్ ఫ్రైని చక్కగా తినొచ్చు.
(ఫ్రై కాకుండా ముద్దగా తినాలని ఇష్టపడేవారు ముక్కలన్నింటితో పాటు 1 టమాటోని కలిపి మిక్సీలో ముద్దగా చేసుకొని ఆ ముద్దని వెన్నలో వేయించి అందులో ఉడికిన పెసలు వేసుకొని తినొచ్చు.)
-కళ్యాణి