Home » Appetizers » Local Kitchen - Mokka Jonna Rava Laddu and Pulauki Tikka
మొక్కజొన్న రవ్వలడ్డు
ఒక గిన్నెలో నెయ్యి వేసి స్టవ్ పై పెట్టాలి. అందులో మొక్కజోన్న రవ్వ వేసి లైట్ గా ఫ్రై చేయాలి. ఆ తరువాత అందులో క్రీం పాలు వేయాలి. 10 నిమిషాల వరకు ఉడకనించి కష్ట గట్టి పడిన తర్వాత పంచదార వేయాలి. ఆ పంచదార కరిగి గట్టి పడిన తర్వాత అందులో పాలపొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత బాదం పొడి, యాలకుల పొడి , మరమరాల పొడి , కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి. చివరగా నెయ్యి వేసి బాణలిలో పిండి పూర్తిగా డ్రై అయ్యేంతవరకు బాగా కలిపి దించాలి. పూర్తిగా చల్లారక లడ్దూల్లా చేసుకుని పేపర్ కప్ లలో సర్వ్ చేయాలి.
సింపుల్ టేస్టీ మొక్కజొన్న రవ్వలడ్డు రెడీ.
పులావు కి తీకా
తయారు చేసే విధానం
స్టవ్ పై పెనం పెట్టి, అది వేడయ్యే లోపు ఒక గిన్నె తీసుకుని అందులో పులావ్ వేసి
సోయా గ్రాన్యుల్స్ , ఉప్పు, పచ్చి మిర్చి పేస్ట్, ఆమ్చూర్ పౌడర్, మిరియాలపొడి, కొత్తిమీర ,వేసి అందులో కొద్దిగా నీళ్ళు వేసి బాగా కలుపుకోవాలి. అలా తయారైన మిశ్రమాన్ని అప్పడాల్లా చేసుకుని నూనెలో వేయించి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి దించేయాలి. వేడి వేడి పులావుకి తీకా రెడీ. దీనిని టొమాటో సాస్ తో లేదా గ్రీన్ చట్నీ తో తింటే చాలా టేస్టీ గా ఉంటుంది.