Home » Sweets N Deserts » Krishnastami Special Recipes
కృష్ణాష్టమి స్పెషల్ రెసిపి
అటుకుల పాయసం రెసిపి
కావల్సిన పదార్థాలు:
అటుకులు - 2 కప్పులు
నెయ్యి - 4 చెంచాలు
కొబ్బరి - 1,
సెనగపప్పు - అరకప్పు,
బెల్లం తురుము - 1కప్పు,
కుంకుమ పువ్వు - కొద్దిగా,
యాలకులపొడి - 1
లవంగాలు - 5
ఎండుద్రాక్ష - 2 చెంచాలు,
జీడిపప్పు - 10.
తయారీ విధానం:
ముందుగ అటుకులను చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కాస్త నెయ్యి వేసి అటుకుల్ని వేయించాలి. అలానే జీడిపప్పు, ఎండుద్రాక్ష, లవంగాలను వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి మిక్సీలో వేసి చిక్కని పాలు తీసుకోవాలి. అందులో అటుకులను నానపెట్టాలి.
తరవాత శనగ పప్పు పప్పు ఉడికాక , అటుకులు, బెల్లంతురుము, కుంకుమపువ్వు వేసి... ఉడికించి యాలకులపొడి, లవంగాలు చేర్చి. జీడిపప్పు వేసుకోవాలి
అటుకుల లడ్డు రెసిపి
కావల్సిన పదార్థాలు:
అటుకులు - 250 గ్రాములు
పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు
నెయ్యి - 50 గ్రా,
జీడిపప్పు - సరిపడా
కావలసిన పదార్థాలు
బెల్లం తురుము - పావుకేజీ,
కిస్‌మిస్ - 10,
యాలకులు - నాలుగు
తయారు చేయు విధానం
ముందుగా అటుకులను వేయించి పొడి చేసుకోవాలి. బెల్లాన్ని తురుముకోవాలి. అటుకుల పొడి, బెల్లం తురుము, పచ్చికొబ్బరి తురుము యాలకుల పొడి బాగా కలపాలి. వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లను అన్నిటిని కలిపి లడ్డులు చేసుకోవాలి.
వెన్న ఉండలు
కావల్సిన పదార్థాలు :
మైదా - 1 కప్
బియ్యం పిండి - 1/4 కప్
వెన్న -1 కప్
చక్కెర -1 కప్
ఉప్పు - చిటికెడు
యాలకులు - 4
వంటసోడ - చిటికెడు
నూనె - సరిపడా
తయారుచేయు విధానం :
ముందుగా ఓ గిన్నె తీసుకుని మైదా , బియ్యం పిండి, ఉప్పు, వెన్న, వంటసోడ వేసి , వేడి నీళ్లు పోస్తూ చపాతి పిండిలా కలుపుకోవాలి. తరువాత వీటిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి.తరువాత స్టవ్ వెలిగించిగిన్నె పెట్టి అందులో నూనె వేయాలి. నూనె బాగా కాగిన తరువాత ఈ ఉండలను వేయాలి. తక్కువ మంటపై బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకుని అదే గిన్నెలో పంచదార వేసి సరిపడా నీళ్ళు పోసి పాకం వచ్చాక వేయించిన ఉండలను పాకంలో వేసుకోవాలి. అంతే వెన్న ఉండలు రెడీ