Home » Vegetarian » Kaddu Kofta Curry Recipe
కద్దూ కోఫ్తా కర్రీ
కావలసిన పదార్ధాలు:
సొరకాయ - ఒకటి
సెనగపిండి - రెండు కప్పులు
పచ్చిమిర్చి - నాలుగు
తయారు చేసే విధానం:
ముందుగా సొరకాయ(అనపకాయ)ను చెక్కు తీసి తురిమి పెట్టుకోవాలి. ఆ తురుములో సెనగపిండి, ఉప్పు, మెత్తగా గ్రైండ్ చేసిన అల్లం, వెల్లుల్ల్లి, పచ్చిమిర్చి పేస్టుని కూడా వేసి కలపాలి. సొరకాయలో నీరు వుంటుంది కాబట్టి ఆ తడి సరిపోతుంది. గట్టిపకోడిల పిండి మాదిరిగా రావాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసి వేడి నూనెలో ఎర్రగా వేయించి, గ్రేవీలో వేసి ఓ పదినిమిషాలు మగ్గిస్తే కద్దూ కోఫ్తా కర్రీ రెడీ అయినట్టే ఈ కూర చపాతిలలోకి బాగుంటుంది.
గ్రేవీ తయారీకి:
ఉల్లిపాయలు - నాలుగు
అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక స్పూను
ధనియాలపొడి - ఒక స్పూను
గసగసాలు - నాలుగు స్పూన్లు
పచ్చికొబ్బరి - చిన్న కప్పుతో
టమాటాలు - మూడు
పెరుగు - ఒక కప్పు
కారం - రెండు స్పూన్లు
పసుపు - చిటికెడు
నూనె - ఒక కప్పు
ఉప్పు - తగినంత
గ్రేవీ తయారు చేసే విధానం:
ఒక గిన్నెలో నూనె పోసి వేడిచేశాకా ముందుగా ఉల్లిపాయలు ముక్కల్ని ఎర్రగా వేయించండి. ఆ తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, పసుపు, ధనియాలపొడి కలపాలి. అలాగే టమాట ముక్కల్ని కూడా వేసి కాసేపు వేయించాలి. ఆ తరువాత గసగసాలు, కొబ్బరి కలిపి మెత్తగా గ్రైండ్ చేసి ఆ ముద్దని కూడా చేర్చాలి. దించే ముందు పెరుగుని వేసి సన్నని మంట మీద ఓ ఐదు నిమిషాలు ఉంచితే గ్రేవీ సిద్దమయినట్టే.
-రమ