Home » Sweets N Deserts » Fruit Halwa
ఫ్రూట్ హల్వా
కావలసిన పదార్థాలు:
పైనాపిల్ ముక్కలు - పావుకప్పు
యాపిల్ ముక్కలు - అరకప్పు
అరటిపండు ముక్కలు - పావుకప్పు
మామిడిపండు ముక్కలు - పావుకప్పు
బొంబాయి రవ్వ - ఒకటిన్నర కప్పు
నీళ్లు - మూడున్నర కప్పులు
చక్కెర - పావుకప్పు
నెయ్యి - నాలుగు చెంచాలు
యాలకుల పొడి - అరచెంచా
జీడిపప్పు, కిస్ మిస్ - గుప్పెడు
తయారీ విధానం :
స్టౌమీద కడాయి పెట్టి చెంచాడు నెయ్యి వేయాలి. వేడెక్కాక జీడిపప్పు, కిస్ మిస్ లను వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బొంబాయి రవ్వను కూడా వేసి పచ్చి వాసన పోయేవరకూ వేయించి తీసేయాలి.
తర్వాత మరో చెంచా నెయ్యి వేసి పండ్ల ముక్కలన్నిటినీ వేసి దోరగా వేయించాలి. వీటిని చల్లారబెట్టి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత స్టౌమీద గిన్నె పెట్టు నీళ్లు, చక్కెర వేయాలి.
మరుగుతున్నప్పుడు రవ్వ వేయాలి. ఉండలు కట్టకుండా కలుపుతూ సన్నని మంట మీద ఉడికించాలి. రవ్వ మెత్తబడిపోయిన తర్వాత పండ్ల గుజ్జును కూడా వేయాలి.
ఉండలు రాకుండా బాగా కలుపుతూ ఉడికించాలి. నీళ్లన్నీ ఇగిరిపోయి దగ్గరగా అయ్యాక మిగతా నెయ్యి, జీడిపప్పు, కిస్ మిస్ వేసి కలపాలి. చివరగా యాలకుల పొడి చల్లి దించేసుకోవాలి. కావాలంటే కాస్త ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు.
- Sameera