Home » Sweets N Deserts » Egg Custard food
Egg Custard food
Ingredients:
* Egg - 2
* milk - 1 glass
* milk biscuits - 2
* essence - 1 spoon
* Sugar - 1/2 cup
Method:
ముందుగా గుడ్లు పగలకొట్టి.. బౌల్ లో వేసుకోవాలి. అందులో షుగర్ వేసి బీట్ చెయ్యాలి. బిస్కెట్లను కొద్ది పాలల్లో నాన బెట్టుకోవాలి. అలా గుడ్డు సొన.. చక్కెర కలిపే మిశ్రమంలో పాలు కలిపి.. బిస్కెట్ మిశ్రమాన్ని వేసి నురగలు వచ్చేలా బీట్ చేస్తూ ఎసెన్స్ కలపాలి. ఇప్పుడు మరో బాణలి తీసుకోని స్టవ్ మీద పెట్టి అందులో రెండు చెంచాల చక్కెర వేసి కొద్దిగా నీరు పోస్తే చక్కర కరిగి పాకం గోధుమ రంగులోకి వస్తుంది. అదే caramel syrup. దానిని బౌల్లో పోసి స్ప్రెడ్ చేసి పాలు గుడ్ల మిశ్రమాన్ని పోసి కుక్కర్లో కింద నీరు పోసి ఆ స్టీల్ బౌల్ కుక్కర్లో ఆవిరిపై ఇడ్లీ మాదిరి ఉడికించుకోవాలి. సరిగ్గా 10 నిమిషాల్లో ఇది తయారవుతుంది. స్టవ్ ఆఫ్ చేసి.. కొద్ది చల్లారిన ఈ custurd ని ఫ్రిజ్ లో 15 నిమిషాలు ఉంచి చెంచా లేక చాకుతో కార్నర్స్ కదుపుతూ దానిని సర్వింగ్ బౌల్ లోకి మార్చాలి. పైన బ్రౌన్ కలర్ కారమెల్.. కింద తెల్లని egg custurd చాలా అందంగా వస్తుంది. ఇక రుచి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఇది తక్కువ పదార్ధాలతో తక్కువ టైంలో తయారవుతుంది. మైక్రో ఓవెన్ వాడాలనుకునేవారు 180 డిగ్రీల tem లో 15 నుండి 20 నిమిషాల టైమ్ లో దీనిని తయారుచేసుకోవచ్చు.