Home » Vegetarian » Doota Perugu Pachadi
దూట పెరుగు పచ్చడి
కావలసిన పదార్ధాలు..
* దూటముక్కలు - 1 /2 కప్పు
* పెరుగు - 1కప్పు
* ఉప్పు - కొద్దిగా
* పసుపు - చిటికెడు
* అల్లం, పచ్చిమిర్చి ముద్ద - 1 /2 స్పూన్
* తాలింపు కొరకు - ఎండు మిరపకాయ 1, అవాలు, జీలకర్ర, మెంతులు
*ఇంగువ - కొద్దిగా
* కరివేపాకు - 1 రెబ్బ
* నూనె - కొద్దిగా
తయారు చేసే విధానం :
* ముందుగా దూట మొదట చక్రాలుగా తరిగి .... తిరిగి దానిలోని పీచునుతీస్తూ చిన్నముక్కలుగా తరుగు కోవాలి.
* ఈ ముక్కలు నల్లబడకుండా పలుచని మజ్జిగతో కడిగి నూనెలో కొద్దిగా మగ్గనివ్వాలి.
* మగ్గి చల్లారనిచ్చాక..పోపు గింజలు వేయించి.. అది కూడా చల్లారిన తరువాత పెరుగు కొద్దిగా గిలకొట్టుకుని చిక్కని పెరుగుతోనే ఈ దూట ముక్కలు పోపు, ఉప్పు, పసుపు వేసి కొత్తిమీరతో అలంకరించుకోవాలి.
* అల్లం పచ్చిమిర్చి ముద్దని పోపుతో పాటు పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఈ దూట ఆరోగ్యానికి చాలా మంచిది