Home » Vegetarian » Capsicum Rice
కాప్సికం రైస్
రోజూ అన్నం.. దానిలో కూరతో భోజనం కానిస్తే రొటీన్ గా అనిపిస్తుంది. ఈ రైస్ తోనే అప్పుడప్పుడు వైరైటీస్ కూడా ట్రైచేస్తే కొంచెం డిఫరెంట్ గా కూడా అనిపిస్తుంది. దీనిలో క్యాప్సికమ్ రైస్ ఒకటి. దీనిని పిల్లలు కూడా బాగా ఇష్టపడుతున్నారు. మీరూ ఒకసారి ట్రైచేసి చూడండి.
కావలసిన పదార్థాలు:
* ఒక కప్పు బియ్యంతో అన్నం వండుకోవాలి.
* కాప్సికం – 3
* నిమ్మకాయ – 1
* వాంగీబాత్ పొడి – 3 టేబుల్ స్పూన్‌లు
* జీడిపప్పు – 10-12
* ఉప్పు తగినంత
* నూనె – 3 టేబుల్ స్పూన్‌లు
* పోపుకు ( ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు,కరివేపాకు )
తయారీ విధానం:
ముందుగా క్యాప్సికంని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలి తీసుకొని దానిలో పోపుకు సరిపడినంత నూనె తీసుకొని నూనె కాగాక దానిలో శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. పోపు వేగాక జీడిపప్పు పలుకులు కూడా వేసి వేయించాలి. ఈ పోపులో ముందుగా తరిగి పెట్టకున్న క్యాప్సికం ముక్కలు, ఉప్పు వేసి మూతపెట్టి ముక్కలు మెత్తబడే వరకూ ఉడికించుకోవాలి. ఇలా క్యాప్సికం ముక్కలు ఉడికిన తరువాత చివర్లో వాంగీబాత్ పొడి వేసి దింపెయ్యాలి. దీనిలో చల్లారిన అన్నం.. కొంచెం నిమ్మరసం వేసి బాగా కలిపాలి.