Home » Appetizers » Bread Upma Recipe
బ్రెడ్ ఉప్మా రెసిపి
కావలసినవి:-
బ్రెడ్ - 8 ముక్కలు
ఆయిల్ - 2 స్పూన్స్
కారం - 1 స్పూన్
ధనియాలు - ఆఫ్ స్పూన్
జీలకర్ర - ఆఫ్ స్పూన్
ఇంగువ - చిటికెడు
మినపప్పు - 1 స్పూన్
ఉల్లిపాయ - 1 టమాట
కెచప్ - 1 స్పూన్
కరేపాకు - ఒక రెమ్మ
పసుపు - చిటికెడు
పంచదార - ఒక స్పూన్
ఉప్పు - సరిపడగా
తయారీ:-
* ముందుగా బ్రెడ్ ముక్కల అంచులు కట్ చేసుకోవాలి.
* తరువాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఉల్లిపాయముక్కలు ,ధనియాలు , జీలకర్ర , కారం కరేపాకు,ఇంగువ ఇంకా మినపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ వేచ్చేవరకు వేయించాలి.
* తరువాత ఒక స్పూన్ టమాటో కెచప్, పసుపు, సాల్ట్ బాగా కలపాలి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు కూడా వెయ్యాలి.
* తరువాత పంచదార వేసి ఒక ఐదు నిముషాలు ఫ్రై అవ్వనివ్వాలి.
* ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చట్నీతో కానీ సాస్ తో కానీ సర్వ్ చేసుకోవాలి.