Home » Appetizers » Bobbarla tho garelu
బొబ్బర్ల తో గారెలు
కావలసినవి :
బొబ్బర్లు - రెండు కప్పులు
జీలకర్ర - ఒక స్పూన్
ఉల్లిపాయ - ఒకటి
పచ్చి మిర్చి - ఆరు
పసుపు - అరస్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్
కరివేపాకు - కొద్దిగా
కొత్తిమీర - కొంచెం
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
తయారీ :
ముందురోజు రాత్రి బొబ్బర్లు నానపెట్టుకోవాలి. నానిన తరువాత నీళ్ళు తీసేసి మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా రుబ్బాలి. దీనిలో కట్ చేసుకున్న,ఉల్లిపాయ,పచ్చి మిర్చిముక్కలు,జీలకర్ర,అల్లంవెల్లుల్లి పేస్ట్, కరివేపాకు,కొత్తిమిర తరుగు, పసుపు,ఉప్పు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి.స్టవ్ పై ఫ్రైయింగ్ పాన్ పెట్టి సరిపడా నూనె పోసి కాగాక పిండి ముద్దను తీసుకుని కావాల్సిన సైజ్ లో గారెలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి తరువాత ప్లేట్లోకి తీసుకుని అల్లం పచ్చడి కాని, గ్రీన్ చట్నీతో కాని, కొబ్బరి చట్నీతో కాని సర్వ్ చేసుకోవచ్చు.