Home » Appetizers » Aloo Batani Chaat
ఆలూ బఠానీ చాట్
కావలసినవి :
బఠానీ : పావుకిలో
ఆలూ : రెండు
కొత్తిమీర : ఒక కట్ట
కారం : ఒక టేబుల్ స్పూన్
ఉప్పు: తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్ : రెండు టేబుల్ స్పూన్స్
పెరుగు : ఒక కప్పు
పంచదార : రెండు టీ స్పూన్స్
ఉల్లిపాయ : ఒకటి
టమాట : ఒకటి
పుదినా : ఒక కట్ట
పచ్చి మిర్చి : నాలుగు
చాట్ మసాల : ఒక స్పూన్
సన్న కారప్పూస : ఒక కప్పు
తయారీ :
ముందుగా బఠానీలు ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. తరువాత పుదినా,పచ్చిమిర్చి కలిపి పేస్టూ చెయ్యాలి.ఆలూ , నానబెట్టిన బఠానీలు, రెండు గిన్నెల్లో వేరు వేరు గా తీసుకుని కుక్కర్ లో పెట్టి ఉడికించాలి. తరువాత టమాట ఉడికించి గ్రైండ్ చెయ్యాలి. ఇప్పుడు పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్, పుదినా పచ్చి మిర్చి పేస్ట్ కూడా వేసి కొద్దిగా వేగాక ముక్కలు కోసి ఉంచిన ఆలూ, బఠానీలు, తగినంత ఉప్పు, చాట్ మసాల, కారం, ఒక చిటికెడు పంచదార వేసుకుని గ్రైండ్ చేసి టమాట కలపాలి కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు చాట్ ప్లేట్ లోకి తీసుకుని పైన సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, కారప్పూస వేసి పైన పంచదార కలిపిన పెరుగు వేసి ,కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకోవాలి.