వెజిటబుల్ స్కేవర్స్
పిల్లలు అడగ్గానే తొందరగా చేసిపెట్టగలిగే మరో స్నాక్ ఐటమ్ గురించి ఈరోజు చెప్పుకుందాం.
కావలసిన పదార్ధాలు:
సోయా చంక్స్ - 2 కప్పులు
మెంతి ఆకులు - చిన్న కప్పుతో
బ్రెడ్ పౌడర్ - కప్పు
నూనె - 2 చెమ్చాలు
కారం - అర చెమ్చా
జీలకర్ర పొడి - అర చెమ్చా
ఉప్పు - రుచికి తగినంత
తయారీ విధానం:
ముందుగా సోయా చంక్స్‌ని ఉడికించి పెట్టుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, కారం, ఉప్పు, చెమ్చా నూనె వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని సన్నగా కట్ చేసిన మెంతి ఆకు, బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి, చేతికి నూనె రాసుకుని ఆ ఉండలని రెండు చేతుల మధ్య పెట్టి ఫింగర్స్‌లా పొడవుగా చేయాలి. ఆ మధ్యలో ఒక టూత్‌పిక్ పెట్టాలి. (అంటే టూత్ పిక్ చుట్టూ సోయా చంక్స్ మిశ్రమాన్ని పెట్టాలి) ఇలా అన్నీ తయారయ్యాక ఒక నాన్‌స్టిక్ పెనం మీద నూనె వేసి రెండు వైపులా ఎర్రగా వచ్చేట్టు కాల్చాలి. వీటిని స్వీట్ చట్నీతో తింటే భలే రుచిగా వుంటాయి.
-రమ