వంకాయ పచ్చికారం
కావలసిన పదార్ధాలు:-
వంకాయ - అర కిలో
నూనె - 1 కప్పు
పసుపు - తగినంత
ఉప్పు - తగినంత
అల్లం ముక్కలు - తగినంత
పచ్చిమిర్చి - 6
ధనియాలు - 1 స్పూన్లు
జీలకర్ర - 1 చిన్న చెంచా
వెల్లుల్లి రేకులు - 10
కొత్తిమీర తరుగు - 1 కప్పు
తయారుచేసే విధానం:-
ముందుగా ధనియాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి మెత్తగా దంచుకోవాలి. వంకాయలు చిన్నముక్కలుగా చేసుకొని, నీళ్ళలో వేయాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి బాగా కడగాలి. బాణలి వేడిచేసి అందులో నూనె ముడు వంతులు పోసి నూనె వేడెక్కగానే ముక్కలు వేసి, 45 ని" మూతపెట్టి ఉంచాలి. తర్వాత ముక్కలు మాడకుండా కలుపుతూ ఉప్పు, పసుపు చల్లి మళ్ళి బాగా కలపాలి. వంకాయ ముక్కలు పూర్తిగా వేగినట్టు తెలియగానే పచ్చికారం ముద్ద వేసి బాగా కలపాలి. దానిపై కొత్తిమీర తరుగు చల్లాలి.