ఉల్లిపాయ పులుసు (అట్లతద్ది స్పెషల్)
కావలసిన పదార్ధాలు:
ఉల్లిపాయ ముక్కలు నిలువుగా తరిగినవి - 1 కప్పు
చింతపండు రసం - పావు కప్పు
బెల్లం - కొద్దిగా
పచ్చి మిర్చి - 1
బియ్యం పిండి - 1/2 చెంచా
ఉప్పు - 1/2 చెంచా
కారం - 1/2 చెంచా
మెంతిపొడి - 1/4 చెంచా
పోపుగింజలు - ఆవాలు, మెంతులు, జీలకర్ర,
ఎండుమిరపకాయలు, కరివేపాకు,
నూనె - తగినంత
తయారుచేసే విధానం :
ముందుగా మూకుడు వేడిచేసి నూనెవేసి.... పోపుగింజలు, ఎండుమిరపకాయలు వేయ్యాలి. వేగాక.... కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించి చింతపండు రసం కొద్దిగా నీరు కలిపి పులుసులాగా చేసి చిన్న మంటపై మరిగించాలి.... ఉల్లి ముక్కలు ఉడికాక పసుపు, ఉప్పు, కారం, మెంతి పిండి వేసి.... బెల్లం జోడించి.... మరికొద్దిగా పులుసు ఉడికాక... కొద్దిగా బియ్యం పిండి నీటిలో కలిపి అదిపులుసులో వేసి స్టౌవ్ ఆఫ్ చెయ్యాలి. ఈ పులుసు అన్నం మరియు పరోటాతో చాలా బావుంటుంది.