ఉలవచారు

 

 

 

ఉలవలు ఒక కప్పు తీసుకొని మూడు గంటలు పాటు నానబెట్టుకోవాలి. తర్వాత నానబెట్టిన ఉలవలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడపోసుకొని పై పొట్టు తిసేసుకుని, క్రింద ఉన్న జ్యూస్ తీసుకోవాలి.

 

కావలసినవి:
ఉలవల జ్యూస్  - పావు లీటరు
చింతపండు - కొద్దిగా 
ఉల్లిపాయలు - రెండు 
పచ్చిమిర్చి - మూడు 
ఉప్పు -తగినంత 
కారం - ఒక స్పూను 
పసుపు - చిటికెడు 
కరివేపాకు - రెండు రెబ్బలు 
నూనె - తగినంత 
పోపుదినుసులు - కొద్దిగా 
నెయ్యి - ఒక స్పూను 
ఎండుమిర్చి - రెండు 
వెల్లుల్లి రెబ్బలు - రెండు 
జీలకర్ర - కొద్దిగా 

 

 

తయారుచేసే విధానం:
ముందుగా తయారు చేసిన ఉలవ  జ్యూస్‌ని ఒక బౌల్‌లో తీసుకొని దానిలో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, ఒక స్పూను కారం వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని 20 నిమిషాలు పాటు మరిగించుకోవాలి. ఈ మిశ్రమంలో కరివేపాకు, నెయ్యి వేసుకోవాలి. నేతితో మరిగితే ఉలవచారు చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత స్టౌ ఆపాలి. 

 

 

 

ఇప్పుడు ఈ ఉలవచారుని  తాలింపు వేసుకోవాలి.
ముందుగా కొద్దిగా  నూనె పోసుకొని కాగిన తరువాత పోపుదినుసులు వేసి, వెల్లుల్లి రెబ్బలు వేసి, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపు మొత్తం బాగా వేగనివ్వాలి. వేగిన ఈ పోపును మరిగిన చారులో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు మరిగించాలి.