టమోటా మసాలా బజ్జీ
కావలసినవి:
టమోటాలు : అర కేజీ
గరంమసాలా : 2 స్పూన్స్
ఆలూ : అర కేజీ
నూనె : సరిపడా
శనగపిండి: ఒక కప్పు
పెసరపప్పు : అర కప్పు
కొత్తిమీర : ఒక కట్ట
ఉల్లిపాయలు: 3
పచ్చిమిర్చి: 4
తయారీ :
ముందుగా టమోటాలు పై భాగం కట్ చేసి లోపలి గింజలను తీసేసి పక్కన పెట్టుకోవాలి.తరువాత పెసరపప్పును, ఆలూను బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన పప్పు, ఆలూ మిశ్రమంలో గరంమసాలా, ఉప్పు, ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగులను కలిపి ముద్దగా చేసుకోవాలి. ఈ ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుని టమోటాల్లో స్టఫ్ఫ్ చెయ్యాలి. తరువాత శనగపిండిని పకోడీ పిండిలా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణీలో నూనె పోసి కాగాక స్టఫ్ఫ్ చేసుకున్న టమోటలను కలిపి ఉంచిన శెనగపిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి. వీటిని సాస్ తో కానీ కాంబినేషన్ చట్నీ తో కానీ సర్వ్ చేసుకోవాలి..